బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం జరిగిన విల్లు -బాల్స్ గేమ్ హౌస్ మేట్స్ మద్యలో చిచ్చు పెట్టింది. ముఖ్యంగా సంచాలక్ శోభాశెట్టి ఇంకా శివాజీ ఇద్దరూ ఒకరికొకరు తగ్గేదేలే అంటూ అరుచుకున్నారు. అసలు ఈటాస్క్ లో శివాజీ మిస్టేక్ చేశాడా ? శోభాశెట్టికి కోపం ఎందుకొచ్చిందో ఒక్కసారి చూసినట్లయితే., బిగ్ హౌస్ లో యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని డిపెండ్ చేసుకుంటూ వచ్చాడు. చివరగా ఛాలెంజ్ లో ముగ్గురు మిగిలారు. దీంతో ముగ్గురికీ కలిపి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. బో అండ్ యారో టాస్క్.
విల్లుని ఎక్కుపట్టి పట్టుకుని బాల్స్ ని యారోగా ఉన్న స్లోప్ లో బ్యాలన్స్ చేస్తూ ఉండాలి. బజర్ మోగినప్పుడల్లా బాల్ ని యాడ్ చేస్తూ వెళ్లాలి. ఇందులో యావర్ కి పోటీగా మిగిలి ఉన్న ప్రియాంక ఇంకా శివాజీ ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ బాల్ వరకూ ముగ్గురూ బాగానే ఆడారు. అయితే, ఆ తర్వాత రెండో బాల్ పెట్టేటపుడే మాటలు మొదలయ్యాయి. బాల్ ని చేత్తో పట్టుకుని పై నుంచీ పెట్టచ్చని సంచాలకులు అయిన ప్రశాంత్ – శోభా ఇద్దరూ చెప్పారు. దీంతో రెండో బాల్ కూడా పెట్టి గేమ్ ఆడుతున్నప్పుడు ప్రియాంక అద్భుతంగా బ్యాలన్స్ చేసింది.
కానీ ఇక్కడే యావర్ – శివాజీ ఇద్దరూ కూడా చాలాసేపు చేతులతోనే బాల్స్ ని పట్టుకుని ఆర్గ్యూమెంట్ చేశారు. శివాజీ అయితే ప్రశాంత్ మాట్లాడద్దు అంటూ అసహనాన్ని ప్రదర్శిస్తూ, చేత్తోనే బాల్స్ ని పట్టుకుని స్ట్రాటజీ ప్లే చేశాడు. అలాగే యావర్ కూడా బాల్స్ పడిపోతుంటే పట్టుకుని మాట్లాడద్దు అంటూ చెప్తూ కాసేపు టైమ్ పాస్ చేశాడు. బిగ్ బాస్ శివాజీకి రెండుసార్లు వార్నింగ్ ఇచ్చాడు. సంచాలక్ అయిన శోభాకూడా పక్కనుంచీ చేత్తో పట్టుకోవద్దన్నా అంటూ మెల్లగా చెప్తునే ఉంది. మూడో బజర్ వచ్చేసరికి ముగ్గురూ మూడోబాల్ ని కలిపారు. దీంతో బ్యాలన్స్ చేయలేక ప్రియాంక గేమ్ నుంచీ అవుట్ అయ్యింది.
తర్వాత శివాజీ బాల్స్ కూడా కిందపడిపోయాయ్. ఇక్కడే ఫ్రస్టేషన్ తో శివాజీ ప్రశాంత్ పై అరిచాడు. అస్తమానం మాట్లాడుతున్నావ్, అటు ఇటు సైగలు చేస్తున్నావ్ అందుకే కాన్సట్రేషన్ కుదర్లేదన్నట్లుగా మాట్లాడాడు. ఇక్కడ శివాజీకి ఇంకా శోభాశెట్టికి ఇద్దరికీ గట్టి యుద్ధమే జరిగింది. మాటకి మాట అనుకున్నారు. ఎలిమినేట్ అయ్యాక బయటకి వెళ్లి చూస్తే తప్పెవరిదో అంటూ శివాజీ మాట్లాడాడు.అంతేకాదు, ఫస్ట్ వీక్ నుంచీ కూడా నువ్వు సంచాలక్ గా ఇలాగే చేస్తున్నావంటూ అన్నాడు. దీనికి శోభాశెట్టికి కోపం వచ్చింది. ఒక్కసారి డెసీషన్ పక్కనబెట్టి డిస్కషన్ పెట్టింది.
అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి, బ్యాడ్ గా ఎందుకు పోట్రే చేస్తున్నారు అంటూ ఎదురు తిరిగింది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోట్లాడుకున్నారు. చివరగా ఫస్ట్ రౌండ్ లో శివాజీ అవుట్ , ఆ తర్వాత యావర్ గెలిచాడని డెసీషన్ ప్రశాంత్ ఇంకా శోభాశెట్టి ఇద్దరూ ఇచ్చారు. ఈ గొడవ ఎక్కడి వరకూ వెళ్లిందంటే., తినే అన్నం మీద ప్రమాణం వరకూ అన్నమాట. శోభాశెట్టి కూడా బాగా ఎమోషనల్ అయి వాష్ రూమ్ లో కూర్చుని ఏడ్చింది. ఇక ఈ ఎంటైర్ టాస్క్ లో శివాజీ చేతులతో బాల్స్ పట్టుకుని చీటింగ్ గేమ్ ఆడాడు. అలాగే అక్కడ స్ట్రాటజీ కూడా ప్లే చేశాడు. అందుకే, శోభాశెట్టి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
సంచాలక్ గా ఈజీగా తీసుకునే నిర్ణయాన్ని కాంప్లికేషన్ చేసుకుంది. మిగతా (Bigg Boss 7 Telugu) హౌస్ మేట్స్ అభిప్రాయాన్ని కూడా అడిగేసరికి శివాజీకి ఇంకా కోపం వచ్చింది. అందుకే, ఇద్దరూ వాదించుకున్నారు. వేరే హౌస్ మేట్స్ ని అభిప్రాయం అడగడంలో, అలాగే నిర్ణయాన్ని త్వరగా తీస్కోవడంలో శోభా విఫలం అయ్యింది. శోభాది తప్పు. అలాగే, శివాజీ గేమ్ ఆడటంలో చీటింగ్ చేశాడు. ఈవిషయంలో శివాజీది కూడా తప్పు ఉంది. ఇద్దరూ మిస్టేక్స్ చేశారు. అలాగే, మరో సంచాలక్ అయిన పల్లవి ప్రశాంత్ కూడా గట్టిగా వాదించలేకోపోయాడు. శివాజీని మీ గేమ్ మీరు ఆడకుండా నా మీద అరుస్తారేంటి అనేది మాత్రమే అనగలిగాడు తప్ప, స్ట్రాంగ్ గా నిర్ణయాన్ని తీస్కోలేకపోయాడు. అదీ మేటర్.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!