Sonu Sood: ఆ విషయంలో వాళ్ళు సోనూసూద్ ను చాలా ఇబ్బంది పెట్టారట… !

సోనూసూద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు విలన్ గా చేసిన ఇతను.. కరోనా టైంలో చేసిన సేవా కార్యక్రమాల వల్ల రియల్ హీరో అయిపోయాడు. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా… ట్రైన్, బస్, ఫ్లైట్ వంటివి ఏర్పాటు చేసి మరీ వాళ్ళను సొంత ఇళ్లకు, గ్రామాలకు చేర్చాడు. ఎంతో మందికి అన్నం పెట్టాడు.అంతేకాదు నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించాడు. పేద రైతులకు ట్రాక్టర్లు ఇచ్చి ఆదుకోవడం, ఇప్పటికీ ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి..

సాయం అని అడిగిన వారికి వెంటనే స్పందించి సాయం చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా థియేటర్ల వద్ద సోనూసూద్ కటౌట్లు పెట్టి మరీ పాలాభిషేకాలు చేయడం ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇదిలా ఉండగా.. సోనూ సూద్ కి కూడా ‘శివాజీ’ సినిమాలో జరిగినట్టు ఓ సంఘటన జరిగిందట. అదెలా అంటే.. ‘శివాజీ’ సినిమాలో హీరో రజినీకాంత్.. విదేశాల్లో సంపాదించింది అంతా తీసుకొచ్చి ఇండియాలో పేద వాళ్ళ కోసం ఖర్చు చేయాలని భావిస్తాడు.

ముఖ్యంగా పేద వారికి ఉచిత విద్య, వైద్యం అందించడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాజకీయ నాయకులు అతనికి అడ్డుపడుతుంటారు. సరిగ్గా సోనూ సూద్ కి కూడా ఇలాగే జరిగిందట. విషయం ఏంటి అంటే.. పేదవారికి ఉచిత వైద్యం,క్వాలిటీతో కూడిన విద్య అందించడానికి (Sonu Sood) సోనూ సూద్ పనులు చెప్పట్టారట. వైద్యం వరకు ఓకే కానీ ఉచిత విద్య ..

అది కూడా క్వాలిటీ విద్య అందించడానికి కొంతమంది రాజకీయ నాయకులు అతనికి అడ్డుపడ్డారట. దీంతో చేసేదేమీ లేక సోనూ సూద్ వెనుదిరిగినట్టు తెలుస్తుంది. నిజంగా విద్య విషయంలో సోనూసూద్ అనుకున్నది చేసుంటే.. చాలా వరకు అతను రాజకీయాలను కూడా శాసించే స్థాయికి వెళ్లిపోయేవాడు అని కొందరు భావిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus