బిగ్ బాస్ సీజన్ – 7 చివరి వారంలోకి వచ్చేసింది. ఇంకోవారమే గ్రాండ్ ఫినాలేకి దగ్గరలో ఉంది. డిసెంబర్ 10వ తేదిన ఆఖరి ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. అయితే, ప్రస్తుతం హౌస్ లో 7గురు ఉన్నారు. వీళ్లలో వచ్చేవారం ఒకరినే ఎలిమినేట్ చేస్తే, టాప్ – 6 ఫినాలేలోకి అడుగుపెడతారు. అప్పుడు మిడ్ వీక్ ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈవారం డబుల్ ఎలిమినేషన్ చేస్తే టాప్ – 5 మంది మాత్రమే ఫినాలేలోకి వెళ్తారు. అప్పుడు లెక్క సరిపోతుంది. ఈనేపథ్యంలో అసలు ఈసీజన్ 7 విన్నర్ ఎవరు అవుతారు అనేది ఒక్కసారి చూసినట్లయితే.,
బిగ్ బాస్ సీజన్ ప్రారంభం నుంచీ అన్ అఫీషియల్ ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ దూసుకుపోతున్నాడు. వచ్చినప్పటి నుంచీ కూడా రైతుబిడ్డి అనే సానుభూతిని బాగా క్యాష్ చేసుకున్నాడు. అంతేకాదు, 50 లక్షలు ప్రైజ్ మనీ గెలిస్తే అందులో ఒక్క రూపాయి కూడా వాడుకోను అని అది పేదవాళ్లకి, పేదరైతులకి , కష్టాల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకునే వారికి నేను ఇస్తానని నాగార్జున ముందు చెప్పాడు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటానని కూడా అన్నాడు. దీంతో పల్లవి ప్రశాంత్ పై ఆడియన్స్ కి ఇంకా గౌరవం పెరిగిపోతుంది.
ఇప్పుడు ఫినాలే వీక్ కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగిపోతుంది. దీంతో ఈ సీజన్ 7 విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా పల్లవి ప్రశాంత్ కే ఉన్నాయి. మరోవైపు శివాజీ కూడా రేస్ లో ఉన్నాడు. శివాజీకి కూడా హౌస్ లోకి వచ్చిన దగ్గర్నుంచీ ప్రజల్లో క్రేజ్ పెరిగిపోయింది. గతంలో తను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ షో ద్వారా సంపాదించిన పాపులారిటీ ఇంకో ఎెత్తు అయ్యింది. 50 లక్షలు అంటూ గెలిస్తే ఏం చేస్తాను అనేది నాకు వచ్చినపుడే చెప్తాను అని చాలా క్లియర్ గా చెప్పాడు శివాజీ.
దీంతో శివాజీకి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఫినాలే వీక్ బాగుంటుంది. శివాజీకి కూడా విన్నర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకోటి సీరియల్ బ్యాచ్ లో అమర్ దీప్ కి మంచి క్రేజ్ ఉంది. అంతేకాదు, వరుసగా నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా ఓట్లు బాగానే వస్తున్నాయి. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ని తెచ్చుకున్నాడు. మద్యమద్యలో పౌల్ గేమ్స్ ఆడినా కూడా తనకి మాత్రం ఫ్యాన్ పాలోయింగ్ పెరుగుతూనే వచ్చింది.
అందులోనూ ఫైనల్ వీక్ సీరియల్ బ్యాచ్ నుంచీ ఎవరైనా వెళ్లిపోతే ఆవారం తనకి బాగా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో అమర్ దీప్ కూడా విన్నర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అర్జున్ అంబటి విషయానికి వస్తే టాస్క్ లు ప్రకారం చాలా బాగా ఆడాడు. లాజిక్స్ కూడా వర్కౌట్ చేశాడు. నామినేషన్స్ లో సత్తా చూపించాడు. బ్రహ్మాండమైన గేమ్ ఆడాడు కానీ, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేకపోవడం అనేది బ్యాడ్ అయ్యింది.
అంతేకాదు, 5వ వారం (Bigg Boss 7 Telugu) హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా అర్జున్ కి మైనస్ అయ్యింది. దీంతో ఓటింగ్ లో వెనకబడ్డాడు. ఒకవేళ పైనల్ వీక్ లో అర్జున్ కి ఓటింగ్ బాగా పడితే రేస్ లోకి వస్తాడు. అలాగే, యావర్ కి కూడా అవకాశం ఉన్నా ఓటింగ్ లో గత రెండు వారాలుగా వెనకబడ్డాడు. ఇక శోభాశెట్టి, ప్రియాంక టాప్ 6, 7 కి మాత్రమే పరిమితం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అదీ మేటర్.