Boss 7 Telugu: శివాజీ Vs శోభాశెట్టి ఇద్దరిలో తప్పెవరిది ? అసలు ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 2వ వారం నామినేషన్స్ లో శివాజీకి ఇంకా శోభాశెట్టికి గట్టిగా పడింది. నిజానికి శోభాశెట్టి ఎప్పట్నుంచో శివాజీకి ఇచ్చిపారేయాలని ఫిక్స్ అయ్యింది. ఇసుకు పోసేటపుడు తనని మాట్లాడనివ్వలేదనే కారణం తనకి ఎప్పట్నుంచో ఉంది. అదే పాయింట్ పై శివాజీని ఈవారం నామినేట్ చేసింది. వేరే వాళ్ల గేమ్ నువ్వు ఆడకు. నీ గేమ్ నువ్వు ఆడు అంటూ శివాజీ రివర్స్ అయ్యాడు. దీంతో శోభాశెట్టి కి శివాజీకి గట్టిగా ఆర్గ్యూమెంట్ అయ్యింది. తర్వాత శివాజీ కూడా నీతో ఆర్గ్యూమెంట్ అనవసరం అంటూ శోభాశెట్టిని నామినేట్ చేశాడు.

ఇక్కడి వరకూ కథ బాగానే నడించింది. కానీ నామినేషన్స్ బ్రేక్ లో మాత్రం ఇద్దరూ రెచ్చిపోయి మరీ ఆర్గ్యూమెంట్ కి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ వరకూ వెళ్లారు. వాలిడ్ రీజన్ తో నామినేట్ చేయలేదని శోభాశెట్టి అంటే, మొత్తం మీరందరూ కూడా కలిసి కట్టుగా ఆడుతున్నట్లుగా ఉందని తేల్చిపారేశాడు. నేను మాట్లాడం స్టార్ట్ చేస్తే తట్టుకోలేవ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి శోబాశెట్టి రెచ్చిపోయింది. బయట అది చేశా, ఇది చేశా అంటే ఇక్కడ చెల్లదన్నట్లుగా మాట్లాడింది శోబా.

దీనికి పో అమ్మా పో అంటూ శివాజీ అంటే మీరు కూడ పోయి వాక్ చేస్కోండి అంటూ మాట్లాడింది. ఈ కంటెంట్ వర్కౌట్ అవ్వదు అంటూ శివాజీ చేతులు ఊపుతూ వెళ్లిపోయాడు. అయినా కూడా శోభాశెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తునే ఉంది. కంటెంట్ ఇవ్వాలంటే నేను కూడా చాలా ఇస్తా.. ఎందుకంటే నేను కూడా యాక్టర్ నే అంటూ శోబాశెట్టి రెచ్చిపోయింది. మోనిత క్యారెక్టర్ ని పూర్తిగా చూపించింది. ఇక దీనికి కౌంటర్ గా శివాజీ ఆర్టిస్ట్ వి కాబట్టే బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేశావ్ బాగా అంటూ మాట్లాడాడు.

దీనికి బిగ్ బాస్ (Boss 7 Telugu) నన్ను ఓడిపోయానని మీకేమైనా చెప్పాడా అంటూ శోబా మరోసారి ఎదురుదాడి చేసింది. ఈ వాగ్వివాదాన్ని మిగతా వాళ్లు అందరూ చూస్తూ ఉండిపోయారు. ఫైనల్ గా శివాజీ నీ ఇష్టం మాట్లాడుకో అంటూ అక్కడ్నుంచీ వెళ్లిపోయాడు. ఇక మార్నింగ్ కూడా శోభాశెట్టి ఇదే మూడ్ లో ఉంది. ప్రియాంక తో ఇదే విషయాన్ని డిస్కస్ చేసింది. శివాజీ వాదించడం ఇష్టం లేదని చెప్తున్నా కూడా రెచ్చిపోయి ఆర్గ్యూచేసింది శోభా. మరి వీళ్లిద్దరిలో మీకు ఎవరిది తప్పు అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రానున్న వారాల్లో తర్వాత టాస్క్ లలో వీళ్లిద్దరూ ఎలా కలిసి ఆడతారు అనేది ఆసక్తికరం.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus