బిగ్ బాస్ శివజ్యోతి ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్!

తెలంగాణా రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న క్రేజే వేరు. ఈ పండుగ దగ్గర పడుతుందంటే చాలు.. బతుకమ్మ స్పెషల్ పాటల వీడియో షూటింగ్ లు షురూ అవుతాయి. డిజిటల్ మీడియా అభివృద్ధి చెందిన తరువాత బతుకమ్మ పాటలకు మంచి క్రేజ్ వస్తోంది. పాట బాగుంటే చాలు నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానెల్స్ కూడా సొంతంగా బతుకమ్మ పాటలను నిర్మించి, విడుదల చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి కూడా ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్ ని విడుదల చేయడం విశేషం.

తీన్మార్ వార్తలతో పాపులారిటీ దక్కించుకున్న శివజ్యోతి.. గతేడాది బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది. ఈ షో తరువాత శివజ్యోతికి కాస్త క్రేజ్ వచ్చింది. దీంతో సొంతంగా ‘జ్యోతక్క’ అనే యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి రకరకాల వీడియోలు షేర్ చేస్తుంది. తెలంగాణాకి చెందిన అమ్మాయి కావడంతో తన కాన్సెప్టులు అన్నీ కూడా తెలంగాణా కల్చర్ కి తగ్గట్లుగా ఎన్నుకుంటోంది. తాజాగా ‘బతుకమ్మ’ పండుగ గురించి ఒక స్పెషల్ పాటను తన యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేసింది.

ఈ పాటలో శివజ్యోతితో పాటు యాంకర్, నటి హిమజ అలానే సీరియల్ నటుడు రవి కూడా కనిపించారు. బిగ్ బాస్ 3లో వీరిద్దరూ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పటినుండి వీరంతా మంచి స్నేహితులయ్యారు. ఇప్పుడు అందరూ కలిసి ‘బతుకమ్మ’ సాంగ్ లో నటించి మెప్పించారు. ఈ పాటను రేలారే గంగ, హనుమంతు యాదవ్ కలిసి పాడారు.


టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus