సింగర్ చిన్మయి (Chinmayi Sripada) అందరికీ సుపరిచితమే. చాలా సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. సమంత వంటి స్టార్ హీరోయిన్లకి డబ్బింగ్ కూడా చెప్పింది. అయితే ‘మీటూ’ టైం ఈమె తమిళ దిగ్గజ లిరిసిస్ట్ అయినటువంటి వైరముత్తు పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈమెను తమిళ సినిమాలకి పనిచేయకుండా బ్యాన్ విధించారు. అయితే ఇప్పటికీ.. అంటే ఆరేళ్ళు అయినా ఆ బ్యాన్ అలానే ఉందట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిన్మయి మాట్లాడుతూ… “తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో వరుసగా సాంగ్స్ పడటం.. డబ్బింగ్ చెప్పడం వంటివి చేస్తున్నాను. కానీ తమిళ సినీ పరిశ్రమ నుండి ఆఫర్లు రావడం లేదు. 2018 లో చోటు చేసుకున్న సంఘటనల వల్ల. అక్కడ సెట్ అవ్వడానికి ఇంకా టైం పట్టొచ్చు. ప్రస్తుతానికి అక్కడ నేను బలి పశువు అయ్యాను. అక్కడ న్యాయం కోసం ఇంకా ఫైట్ చేస్తున్నాను.
ఇండియాలో న్యాయం అంత త్వరగా దొరకదు. తమిళ సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద వాళ్ళు కూడా న్యాయస్థానాన్ని శాసించగలరు. ఎందుకంటే అక్కడ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సినీ పరిశ్రమకి చెందినవారే. అలాగే పాలిటిక్స్ లో ఉన్నవాళ్లు కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎక్కువ. నేను ఎవరిపై(వైరముత్తు) అయితే కేసు వేశానో, అతనికి డబ్బింగ్ డిపార్ట్మెంట్స్ లో పట్టు ఎక్కువ.
అక్కడ పనిచేసేవాళ్ళకి కూడా భయం ఎక్కువ. వాళ్ళ కెరీర్ ఏమవుతుందో అని బయటకు వచ్చి నిజాలు చెప్పరు. పోనీ నేను డబ్బింగ్ కాకుండా యాక్టింగ్ వంటివి చేసుకుంటాను అని చెప్పినా అక్కడ కూడా అతనికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో నెగ్గుకు రాలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చింది.