Sj Suriya Remuneartion: టాలీవుడ్ నిర్మాతకి చుక్కలు చూపించిన ఎస్.జె.సూర్య..!

ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. ఇది వరకు అయితే తెలుగు రాష్ట్రాల తర్వాత ఓవర్సీస్ మాత్రమే కలెక్షన్ల సోర్స్ గా ఉండేది. కానీ ఇప్పుడు సౌత్ లోని అన్ని భాషల్లోనూ అలాగే నార్త్ లో కూడా తెలుగు సినిమా అంటే మంచి క్రేజ్ నెలకొంది. కాబట్టి పాన్ ఇండియా సినిమాని రూపొందించే ప్రతీ నిర్మాత కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లో క్రేజ్ ఉన్న నటులను ఎంపిక చేసుకుంటున్నారు.

Click Here To Watch

అదే రీతిగా ఇటీవల టాలీవుడ్ కు చెందిన ఓ బడా ప్రొడ్యూసర్ తన సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ దర్శకుడు కమ్ నటుడు అయిన ఎస్.జె.సూర్యని సంప్రదించాడట. ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..! ‘వాలి’ ‘ఖుషి’ ‘కొమరం పులి’ ‘నాని’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ‘స్పైడర్’ చిత్రంలో విలన్ గా కూడా నటించాడు. ఈ చిత్రం ప్లాప్ అయినప్పటికీ ఎస్.జె.సూర్యకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

ఆ వెంటనే వచ్చిన ‘మెర్సల్'(తెలుగులో ‘అదిరింది’) కూడా హిట్ అవ్వడంతో సూర్యకి డిమాండ్ పెరిగింది.ఇటీవల వచ్చిన ‘మానాడు’ కూడా సూపర్ హిట్ అవ్వడం ఇతనికి మరింత ప్లస్ అయ్యింది. అందుకే ఇప్పుడు అతను ఏదైనా సినిమాలో విలన్ గా నటించాలి అంటే రూ.7 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. సరిగ్గా ఇటీవల టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ వద్ద కూడా అలాగే డిమాండ్ చేసాడట.దాంతో ఒక్కసారిగా మన టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ షాక్ అయ్యాడు.

సూర్యతో కాసేపు భేరాలు ఆడినా ప్రయోజనం లేకపోయింది. తమిళ నటులు ఈ మధ్యన అలాగే డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. విజయ్ సేతుపతి అయితే రూ.10 కోట్లు, సముద్రఖని రూ.5కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఇటీవల చెన్నై మీడియా వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ మన తెలుగులో మంచి నటులే లేనట్టు.. ఇక్కడి దర్శకనిర్మాతలు వాళ్ళ వెంటే పడుతున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus