Sj Surya, Mahesh Babu: మహేష్ మేనరిజమ్స్ పై ఎస్.జే సూర్య కామెంట్స్ వైరల్!

మహేష్ బాబు హీరోగా ఎస్.జే సూర్య డైరెక్షన్ లో చాలా సంవత్సరాల క్రితం నాని సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే చిన్నపిల్లలకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమా తర్వాత స్పైడర్ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తే ఎస్.జే సూర్య విలన్ రోల్ లో నటించారు. స్పైడర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

అయితే తాజాగా ఒక సందర్భంలో ఎస్.జే సూర్య మాట్లాడుతూ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టైన మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలను తాను చూశానని మహర్షి సినిమాలో మహేష్ నటన, సినిమా కథనం తనకు చాలా నచ్చాయని సూర్య అన్నారు. మహర్షిలో మహేష్ బాబు అదరగొట్టారని సూర్య పేర్కొన్నారు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ కూడా సూపర్ గా ఉందని సూర్య అన్నారు.

సినిమాలోని రైలు సన్నివేశంలో మహేష్ బాబు కడుపుబ్బా నవ్వించారని సూర్య కామెంట్లు చేశారు. ఆ మూవీలో ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ నటించలేదని నిజ జీవితంలో ఆయన ఏ విధంగా ఉంటారో అలా ఉన్నారని సూర్య తెలిపారు. ట్రైన్ సీన్ లో మహేష్ బాబు మేనరిజమ్స్ తలచుకుంటే నవ్వొస్తూనే ఉంటుందని మహేష్ బాబు ఎంత అద్భుతంగా నటించారో అంటూ సూర్య చెప్పుకొచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని సన్నివేశాలను తాను చాలా ఎంజాయ్ చేశానని సూర్య కామెంట్లు చేశారు.

మహేష్ యాక్టింగ్ టాలెంట్ గురించి చెప్పడానికి ట్రైన్ సీన్ చాలు అని సూర్య పేర్కొన్నారు. ఎస్.జే సూర్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ త్వరలో సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 1వ తేదీకి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ తేదీకి ఈ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus