#RC15: శంకర్ చరణ్ మూవీలో సూర్య రోల్ అలా ఉంటుందా?

చరణ్ శంకర్ కాంబినేషన్ లో 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 2023 సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ మూవీలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారని గతంలోనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఎస్‌జే సూర్య రోల్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రాలేదు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎస్‌జే సూర్య ఈ సినిమాలో సీఎం కొడుకు పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని సమాచారం అందుతోంది. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ కియారా లవ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని బోగట్టా. శంకర్ ఈ సినిమా కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఈ సినిమా అంచనాలకు అందని ఉంటుందని తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా శంకర్ ఖాతాలో సరైన హిట్ లేదు. రోబో సినిమా తర్వాత తర్వాత సినిమాలతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో శంకర్ ఒక విధంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. శంకర్ ను అభిమానించే అభిమానులు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నారు. చరణ్ సినిమాకు శంకర్ 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. చరణ్ ఈ సినిమా పూర్తైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లలో నటించనున్నారు.

చరణ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమాలో, సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో, మంచి గుర్తింపు ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా చరణ్ రేంజ్ పెరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus