Skanda Twitter Review: ‘స్కంద’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఊర మాస్ యాక్షన్ డ్రామా ‘స్కంద’. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ , పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ‘స్కంద’ పై అంచనాలే బాగానే పెరిగాయి.

సెప్టెంబర్ 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. రామ్ మాస్ పెర్ఫార్మన్స్, సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయట. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటుంది అని తెలుస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బోర్ కొట్టించిందని, అయితే జాతర ఫైట్ మాత్రం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉందని తెలుస్తుంది. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం సినిమా ఆకట్టుకుంటుందని… అంటున్నారు. మొత్తంగా ‘స్కంద’ బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో ఒకసారి చూసే విధంగా ఉందని తెలుస్తుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోసారి హైలెట్ అయ్యింది అని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus