ఒక్క సినిమా విడుదల తేదీ మారితే… మొత్తం ఇండస్ట్రీలో సినిమాల సంగతి మారుతుంది అంటారు. అయితే ఆ సినిమా పెద్ద హీరో సినిమా అయి ఉండాలి, లేదంటే పెద్ద బడ్జెట్, బ్యానర్‌లో వస్తున్న సినిమా ఉండాలి. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి మార్పు తీసుకొచ్చిన సినిమా ‘సలార్’. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాను సెప్టెంబరు నెలాఖరున అంటే 28న విడుదల చేస్తామని చాలా నెలల క్రితమే చెప్పారు. అయితే ఇప్పుడు తేదీలో మార్పు చేశారు. దీని వల్ల టాలీవుడ్‌లో చాలా సినిమాల తేదీలు మారుతున్నాయి అంటున్నారు.
టాలీవుడ్‌లో కరోనా సమయంలోనే పెద్ద సినిమాల వాయిదా అనే మాట విన్నాం. ఇటీవల కాలంలో సినిమా విడుదలకు నెల ఉందనగా ఏ సినిమా కూడా ఇలా వాయిదా పడలేదు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో వరుసగా చాలా సినిమాల తేదీలు మారుతాయి అంటున్నాయి. ‘సలార్’ ఈ నెల తీసుకురాం, నవంబరులో తీసుకొస్తాం అని టీమ్ అధికారికరంగా చెప్పలేదు కానీ.. బాలీవుడ్ విశ్లేషకులు, మీడియా అయితే చెప్పేసింది. దీంతో నిర్మాణంలో చివరి దశలో ఉన్న, లేకపోతే వివిధ కారణాల వల్ల ఆగిన సినిమాల పనులు స్పీడప్ చేస్తున్నారట.
పెద్ద హీరో సినిమా (Movies) అంటే సరైన డేట్‌నే ఎంచుకుని ఉంటారు. లాంగ్ వీకెండ్‌లు, పండగలు లాంటివి చూసుకుంటారు. సెప్టెంబరు 28 కూడా అలాంటిదే. దీంతో టాలీవుడ్‌లో చిన్న సినిమాల జనాలు సిద్ధమైపోతున్నారు. రెండు వారాలు గట్టిగా ప్రచారం చేసుకుని సినిమాను తెచ్చేద్దాం అనుకుంటున్నారట. మరోవైపు నవంబరులో ‘సలార్’ వెళ్తుండటంతో అక్కడ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల డేట్స్ కూడా మారే అవకాశం ఉంది అంటున్నారు.
అయితే ఇదంతా ‘సలార్’ టీమ్ అధికారికంగా చెప్పాకనే తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుండి ట్రైలర్ రావాల్సింది రాలేదు. ఆ విషయం గురించి వాకబు చేస్తేనే వాయిదా సంగతి లీక్ అయ్యింది అంటున్నారు. మరి ఎప్పడు అఫీషియల్ సమాచారం ఇస్తారో, ఎప్పుడు మిగిలిన వాళ్లు సినిమా డేట్స్ చెబుతారో చూడాలి. అన్నట్లుగా సెప్టెంబరు రెండు, మూడు వారాల్లో వచ్చే సినిమాలకు ‘సలార్’ వాయిదా వల్ల లాంగ్ రన్ దొరికే అవకాశం కూడా ఉంది.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!