Bigg Boss 7 Telugu: బాడీ చూపించి రెచ్చిపోయిన గౌతమ్..! గౌతమ్ కి కోపం ఎందుకు వచ్చిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం బిగ్ బాస్ చేసిన పనికి హౌస్ మేట్స్ మద్యలో చిచ్చు రాసుకుంది. కావాలనే ఫిట్టింగ్ పెడుతూ హౌస్ మేట్స్ మద్యలో గొడవలు పెట్టేందుకు టాస్క్ డిజైన్ చేశాడు బిగ్ బాస్. లాస్ట్ వీక్ చాలా చప్పగా సాగినా, ఈవారం మాత్రం కంటెంట్ ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ రెచ్చిపోతున్నారు. పైగా నామినేషన్స్ లో ఉన్న గౌతమ్ ఛాన్స్ దొరికింది కదా అని శోభాశెట్టికి ఇచ్చిపారేశాడు. అసలు గౌతమ్ కి ఎందుకు కోపం వచ్చిందంటే, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ముగ్గురులో ఒక కంటెండర్ ని ఈవారం రేస్ నుంచీ తొలగించాలి అన్నప్పుడు గౌతమ్ శోభాశెట్టి పేరు చెప్పాడు.

తను ఐసోలేటెడ్ గా ఉంటోందని, గణేష్ ఫెస్టివల్ కూడా రావడానికి మేకప్ వేస్కుంటూ టైమ్ వేస్ట్ చేసిందని, అలాగే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఆ టాస్క్ వచ్చేసరికి ఆడలేకపోతోందనే రీజన్స్ చెప్పాడు. ఈ రీజన్స్ ని బిగ్ బాస్ చూపించేసరికి శోభాశెట్టి రెచ్చిపోయింది. ఇవి చాలా బక్వాస్ రీజన్స్ అంటూ రెచ్చిపోయింది. నిజానికి శోభాశెట్టిని ముగ్గురు అనర్హురాలని చెప్పారు. అందులో పల్లవి ప్రశాంత్, శుభశ్రీ ఇంకా గౌతమ్ ముగ్గురు ఉన్నారు. పల్లవి ప్రశాంత్ కూడా చెప్పిన రీజన్ అంతగా శోభాకి నచ్చలేదు. అయినా, గౌతమ్ దొరికేసరికి రెచ్చిపోయి గొడవ స్టార్ట్ చేసింది.

నువ్వు చెప్పిన రీజన్ అదో రీజనా.. తూ.. బక్వాస్ అంటూ గౌతమ్ పై సివంగిలా విరుచుకుపడింది. దీంతో గౌతమ్ ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేశాడు. మద్యలో మాటకి మాట వచ్చి, నువ్వు కూడా జిమ్ చేస్తావ్ గా డైలీ, మరి కుస్తీపోటీలో ఎక్కువ సేపు ఉండలేకపోయావ్.. నేను నీకంటే ఎక్కువ టైమ్ ఉన్నాను తెలుసా అంటూ రెచ్చిపోయింది. దీంతో గౌతమ్ నేను జిమ్ చేస్తే నీకెందుకు అంటూ పుల్ రాజా పుల్ లో నాకు ఎలా దెబ్బతగిలిందో తెలుసా అంటూ తన షర్ట్ విప్పేసి బాడీ చూపిస్తూ దెబ్బ చూపించే ప్రయత్నం చేశాడు.

నేను ఈ షోకి నీ బాడీ చూడటానికి రాలేదని సెటైర్స్ వేస్తూ శోభాశెట్టి రెచ్చిపోయింది. దీనికి గౌతమ్ సీరియస్ అయ్యి, నా పర్సనల్ గా జిమ్ చేయడాన్ని అబ్జక్ట్ చేస్తున్నావ్ అని రెచ్చిపోయి అరిచాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు రంకెలు వేసుకుని అరిచారు. ఫ్రస్టేట్ అయిపోయిన గౌతమ్ నా ఇష్టం ఉన్నప్పుడు నేను జిమ్ చేస్తా నీకెందుకు అంటూ వెయిట్స్ ఎత్తుతూ గార్డెన్ ఏరియాలో రెచ్చిపోయాడు. ఇందతా చూస్తున్న హౌస్ మేట్స్ వారిద్దరి మద్యలోకి దూరలేదు. శోభా బాడీ పెంచావ్, జిమ్ చేస్తావ్ గా ఎందుకు ఓడిపోయావ్ అన్న మాటకి గౌతమ్ ట్రిగ్గర్ అయిపోయాడు.

దీంతో ఇద్దరూ చాలాసేపు వాడి వేడిగా ఆర్గ్యూ చేసుకున్నారు. నీకంటే నేను ఎక్కువ వారాలు ఉంటా.. ఛాలెంజ్ అంటూ జబ్బలు చరుచుకున్నారు. మిగతా హౌస్ మేట్స్ సైలెంట్ గా వీళ్ల ఆర్గ్యూమెంట్స్ విన్నారు. ఆ తర్వాత శోభాశెట్టి ప్రశాంత్ ఇచ్చిన రీజన్ ని కూడా తప్పుబట్టింది. దీంతో శోభాశెట్టి తదుపరి ఛాలెంజ్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఛాలెంజ్ లో గెలిస్తేనే తనకి కంటెండర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మొత్తానికి మూడోవారం (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ హౌస్ లో పెద్ద గొడవలే సృష్టించాడు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags