నాగ చైతన్య (Naga Chaitanya) , శోభిత (Sobhita Dhulipala) గతేడాది చివర్లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత శోభిత సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. దీంతో ‘ఆమె ఇక సినిమాలు చేయదేమో’ అని కొందరు భావించారు. కానీ అలాంటిదేమీ లేదు అనేది లేటెస్ట్ టాక్. మంచి కథలు దొరికితే చేయడానికి ఆమె రెడీగానే ఉంది. అయితే గ్లామర్ రోల్స్ కాకుండా.. కథని ముందుకు నడిపించే పాత్రలు చేయడానికి ఆమె ఆసక్తి చూపుతోంది.
మొదటి నుండి శోభిత అలాంటి పాత్రలే చేస్తూ వస్తోంది. ‘గూఢచారి’ (Goodachari) ‘మేజర్’ (Major) ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan) ‘పొన్నియన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan: II) వంటి కంటెంట్ ఉన్న సినిమాల్లోనే నటించింది. అవి మంచి ఫలితాలు అందుకున్నాయి. పెళ్ళయ్యాక కూడా అలాంటి పాత్రలే చేయాలని శోభిత భావిస్తుంది. ఇందులో భాగంగా.. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ లో ఆమె ఓ ప్రాజెక్టు చేయడానికి అంగీకరించిందట. ఇందులో ఆమె విశ్వదేవ్ రచ్చకొండకి జోడీగా నటించబోతుందట.
’35’ సినిమాతో విశ్వదేవ్ (Vishwadev) బాగా పాపులర్ అయ్యాడు. ఆ సినిమాలో అతని నటన కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. చాలా సహజంగా నటించాడు. ఆ సినిమాని కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఇప్పుడు ఇదే బ్యానర్లో విశ్వదేవ్ మరో సినిమా చేస్తుండటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మేకర్స్ ప్రకటిస్తారు. మరి శోభిత సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.