అక్కినేని నాగార్జున హీరోగా రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.2016 వ సంవత్సరం జనవరి 15న ఈ చిత్రం విడుదలయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలై 6ఏళ్ళు పూర్తికావస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అప్పటికి నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా.. అలాగే ఆ సంక్రాంతికి విన్నర్ గా నిలిచింది.
పోటీగా ఎన్టీఆర్- సుకుమార్ ల ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’, శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు ‘సోగ్గాడే చిన్ని నాయన’ కే ఓటు వేశారు. నిన్ననే ఈ చిత్రానికి సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ కూడా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
అయితే ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 12.08 cr |
సీడెడ్ | 7.13 cr |
ఉత్తరాంధ్ర | 4.04 cr |
ఈస్ట్ | 4.24 cr |
వెస్ట్ | 2.36 cr |
గుంటూరు | 4.20 cr |
కృష్ణా | 2.85 cr |
నెల్లూరు | 1.93 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 38.83 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.88 Cr |
ఓవర్సీస్ | 3.76 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 47.47 cr |
‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి కేవలం రూ.18.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.47.47 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకి రూ.28.97 కోట్ల భారీ లాభాలను అందించింది ఈ చిత్రం. అంటే పెట్టిన పెట్టుబడికి రెండింతలు పైనే. ఆ టైములో సీనియర్ హీరోల్లో(సోలోగా) ఇంత షేర్ ను రాబట్టిన ఏకైక హీరోగా నాగార్జున రికార్డు సృష్టించాడు. మరి ఇప్పుడు ‘బంగార్రాజు’ ఎంత రాబడుతుందో చూడాలి..!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!