బిగ్ బాస్ 4: ఫోన్ లేకపోతే నేనేంటో నాకు అర్ధమైంది..!

బిగ్ బాస్ హాస్ లోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పులేంటి అనేది హౌస్ మేట్స్ తో పంచుకోమని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఒక్కొక్కరు వారి మనసులో మాటల్ని షేర్ చేసుకున్నారు. సోహైల్ మాట్లాడుతూ నాకు చాలా విషయాల్లో బిగ్ బాస్ హౌస్ ఎన్నో నేర్పింది అంటూ చెప్పుకొచ్చాడు. సోహైల్ ఇక్కడి వచ్చాక ఫస్ట్ నాకు ఫుడ్ వ్యాల్యూ ఏంటో తెలిసింది. అని, అన్నం విలువ ఎంత గొప్పదో నేర్చుకున్నానని అన్నాడు.

అంతేకాదు, 24గంటలూ నేను ఫోన్ లోనే ఉండేవాడిని అని, తమ్ముడు పక్కన ఉన్నా కూడా వాడితో మాట్లాడేవాడ్ని కాదని చెప్పాడు. ఇప్పుడు మనుషుల విలువ నాకు అర్ధమైంది అని, బయట ఉండేటపుడు ఎవరైనా మిత్రులు ఎక్కడికైనా వెళ్తుంటే చాలా క్యాజువల్ గా వెళ్లి బైబై చెప్పేసే వాళ్లం. కానీ, ఇక్కడే మనతో ఉన్న కుటుంబసభ్యులు ఎలిమినేట్ అయి వెళ్లిపోతుంటే తట్టుకోలేకపోతున్నాం అని చెప్పాడు. అంతేకాదు, ఇక్కడ రియల్ ఎమోషన్స్ అంటే ఏంటో నాకు అర్దం అయ్యాయి అని, మనుషులతో మనసు బాగా కలిసిందని చెప్పాడు.

ఇక తనకోపాన్ని పదిరెట్లు తక్కువ చేసుకున్నాను అని, బయట సోహైల్ కోపం వేరు బిగ్ బాస్ హౌస్ లో సోహైల్ కోపం వేరు అని చెప్పాడు. ఇక్కడ మనుషులతోనే మాట్లాడాలనిపిస్తోందని, ఫోన్ వదిలేశాక, ఫోన్ లేకపోతే నేనేంటో నాకు తెలిసింది. అలాగే మనిషి విలువ, పేరెంట్స్ విలువ తెలుస్తుందని చెప్పాడు. ఇదంతా నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాకే తెలిసిందని తన మనసులో మాటల్ని షేర్ చేసుకున్నాడు.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus