బిగ్ బాస్ 4 : సోహైల్ – అఖిల్ ఇజ్జత్ పోయిందా..!

  • November 27, 2020 / 01:21 PM IST

బిగ్ బాస్ హౌస్ లో దెయ్యం జలజ చేసిన కామెడీ ఇంతా ఇంతా కాదు. ఫస్ట్ డే షో చప్పగా సాగినా, సెకండ్ డే మాత్రం గొప్పగానే సాగింది. ముఖ్యంగా దెయ్యం బొమ్మ సెకండ్ హాఫ్ పిచ్చెక్కించిందనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ 12వ అంతస్తు సినిమా చూస్తూ హౌస్ మేట్స్ ఒక్కొక్కరూ చీకటి రూమ్ అయిన కన్ఫెషన్ రూమ్ కి వెళ్లారు. అక్కడ జలజ పెట్టిన స్పూన్స్ ని కలెక్ట్ చేశారు. ఫస్ట్ అరియానా పేరు చదవగానే అరియానా చాలా భయపడిపోయింది. నేను వెళ్లను అంటే వెళ్లను అంటూ చాలాసేపు భయపడింది.

ఇక్కడే అవినాష్ పేరు కూడా పిలవడంతో ఇద్దరూ కలిసి చీకటిరూమ్ లోకి వెళ్లారు. అక్కడ అరియానా భయపడుతుంటే వెనకనుంచీ సోహైల్ బాగా ఫన్ చేశాడు. కెప్టెన్ హారికతో కలిసి డ్యాన్స్ చేశాడు. అరియానా భయపడుతుంటే భలే అనిపించింది అంటూ టీజ్ చేశాడు. తర్వాత మోనాల్ కాస్త ధైర్యంగానే వెళ్లింది. చీకటిరూమ్ లో లైట్ వేస్తేనే వస్తాను అంటూ చాలాసేపు అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత ట్రే లో ఉన్న స్పూన్ ని కలెక్ట్ చేసి ధైర్యంగానే బయటకి వచ్చింది.

ఆ తర్వాత వెళ్లిన అఖిల్ – సోహైల్ ఇద్దరూ హైలెట్ అని చెప్పాలి. ముఖ్యంగా దెయ్యం తో సోహైల్ చేసిన కామెడీ ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. అంతకుముందు నాకేం భయం అంటూ లోపలకి వెళ్లి చీకటిరూమ్ లో సోహైల్ పడిన అవస్ధ ప్రేక్షకులని మెప్పించింది.

అంతేకాదు, మోనాల్ ముందు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత అఖిల్ – సోహైల్ ఇద్దరూ వచ్చి గార్డెన్ ఏరియాలో ఈ విడియో ఎవరికీ చూపించద్దు ప్లీజ్ అంటూ వేడుకున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus