సోహెల్‌… సేవ మొదలుపెట్టేశాడు

‘బిగ్‌ బాస్‌ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన డబ్బులుతో ఏం చేస్తావ్‌’ అని కంటెస్టెంట్లను అడిగితే… ఇల్లు కొనుక్కుంటాం, అప్పులు తీర్చేస్తా, కారు కొనుక్కుంటూ, మా అమ్మనాన్నకు ఇచ్చేస్తా అని చెబుతుంటారు. కొందరైతే సేవా కార్యక్రమాలకు కొంత భాగం కేటాయిస్తా అని చెబుతుంటారు. నాలుగో సీజన్‌ బిగ్‌బాస్‌లో మూడో స్థానంలో నిలిచిన సోహెల్‌ ఇలా ఆఖరి మాట చెప్పాడు. నాకొచ్చిన డబ్బుల్లో 10 నుంచి 15 శాతం సేవా కార్యక్రమాలకు ఇస్తానని చెప్పాడు. వాళ్ల తమ్ముడు కూడా అదే సూచించాడు. అయితే మాట ఇచ్చి తర్వాత తప్పుతాడులే అనుకున్నవాళ్లకు సమాధానం ఇచ్చాడు సోహెల్‌. అది మాటల్లో కాదు.. చేతల్లోనే.

‘ఎవరు బిగ్‌బాస్‌ ఆఖరి రోజు ₹25 లక్షలు తీసుకొని బయటికి వచ్చేస్తారు?’ అని అడిగితే ఓకే చెప్పాడు సోహెల్‌. అలా బయటకు వచ్చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు. స్టేజీ మీద కూడా తనకు వచ్చిన డబ్బు నుంచి సేవా కార్యక్రమాలు చేసే అంశం ప్రస్తావనకు తీసుకొచ్చాడు. దానికి స్పందించిన చిరంజీవి, నాగార్జున కూడా తమ తరఫున డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఆ మొత్తం డబ్బులో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చుపెడుతున్నారు. నగరంలోని నేరెడ్‌మెట్‌లో ఉన్న మ‌దర్స్ నెస్ట్ వృద్ధాశ్రమం, రామ‌గుండంలోని త‌బిత స్వ‌చ్ఛంద సంస్థ‌, హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్ర‌న్స్ సోష‌ల్ ఆర్గ‌నైజేష‌న్‌, విజ‌య‌వాడ‌లోని జామియా మ‌హ‌దుల్ అష్రాఫ్ వంటి సేవా సంస్థ‌ల‌తో పాటు మ‌హ్మ‌ద్ మెయునుద్దీన్ కుటుంబానికి డబ్బులు అందజేశాడు.

మొత్తం వీటన్నింటికి కలిపి సుమారు 10 నుంచి 15 లక్షల వరకు డబ్బులు సోహెల్‌ ఇచ్చి ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు సోహెల్‌కు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ‘జార్జిరెడ్డి’ నిర్మాత బ్యానర్‌లో ఓ సినిమా ప్రకటించారు. ఓ బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లోనూ చేస్తున్నట్లు సోహెల్‌ ఇటీవల ప్రకటించాడు. ఇది కాకుండా సీరియళ్లలోను ముఖ్యమైన పాత్రలు వస్తున్నాయట. ఏమాటకామాట సోహెల్‌కు బిగ్‌బాస్‌ బాగా కలిసొచ్చినట్లుంది కదా.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus