‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫామ్లోకి వచ్చిన మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా,నభా నటేష్ హీరోయిన్ గా నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. దాదాపు 9నెలల పాటు థియేటర్లు క్లోజ్ అయ్యి ఉండడంతో.. జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటిల వైపే చూస్తూ వచ్చారు. కరోనా భయం జనాల్లో తగ్గకపోయినా ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీం ధైర్యం చేసి.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేశారు? సినిమా పెద్దగా ఎంటర్టైన్ చెయ్యకపోయినా.. ఓసారి థియేటర్ మొహం చూసి రావాలి అనుకునే ప్రేక్షకులు ఉత్సాహం.. ‘సోలో బ్రతుకు’ ని ఎంకరేజ్ చేసినట్టయ్యింది. దాంతో చాలా వరకూ ఈ చిత్రం సేఫ్ అయిపోయిందనే చెప్పాలి.
ఇక ఈ చిత్రం 6 కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే:
నైజాం | 2.83 cr |
సీడెడ్ | 1.45 cr |
ఉత్తరాంధ్ర | 1.21 cr |
ఈస్ట్ | 0.68 cr |
వెస్ట్ | 0.43 cr |
కృష్ణా | 0.47 cr |
గుంటూరు | 0.68 cr |
నెల్లూరు | 0.41 cr |
ఏపీ+తెలంగాణ | 8.16 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.49 cr |
ఓవర్సీస్ | 0.36 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 9.01 cr |
‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.9.01 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో 0.60 లక్షల వరకూ షేర్ ను రాబడితే .. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి.. క్లీన్ హిట్ గా నిలిచినట్టే.! మరో లాంగ్ వీకెండ్ మిగిలుంది కాబట్టి.. సాయి తేజ్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే చెప్పాలి. అయితే జనవరి ఒకటి నుండీ ఈ చిత్రాన్ని ‘పే పెర్ వ్యూ’ పద్ధతిలో ఓటిటిలో విడుదల చేస్తున్నారు. మరి దాని ఎఫెక్ట్ థియేట్రికల్ పై పడుతుందో లేదో చూడాలి..!
Click Here To Read Movie Review
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!