క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న సుప్రీం హీరో సాయితేజ్ ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ విడుద‌ల

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ . ఈ చిత్రాన్ని మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో విడుద‌ల చేస్తున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సంద‌ర్భంగా..

సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘‘ఇన్ని రోజులు మ‌నం ఎలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నామో మ‌న‌కు తెలుసు. ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌ను మ‌ళ్లీ ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మేం సిద్ధ‌మ‌వుతున్నాం. అందులో భాగంగా క్రిస్మ‌స్‌కు మిమ్మ‌ల్ని న‌వ్వించ‌డానికి. అన్ని ఎమోష‌న్స్ ఉన్న‌ సినిమా ఫుల్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డిసెంబ‌ర్ 25న ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ చిత్రంతో మీ ముందుకు వ‌స్తున్నాం’’ అన్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ మాట్లాడుతూ ‘‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’ సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేస్తుండ‌టం ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. మా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు.

Most Recommended Video

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus