తెలుగు సినిమాల్లో పాటలు చాలా వచ్చి ఉంటాయి. కానీ పెళ్లి పాటలు మాత్రం చాలా తక్కువ వస్తాయి. అందుకే ఇప్పటికే పెళ్లి అంటే… అప్పుడెప్పుడో వచ్చిన ‘సీతారాముల కళ్యాణం’లోని పాటో, ‘పెళ్లి పుస్తకం’లోని పాటో, ‘మురారి’లోని పాటో వేస్తుంటారు. ఆ తర్వాత కొన్ని పాటలు వచ్చినా మొదటి స్థానం మాత్రం ఈ రెండు పాటలవే అని చెప్పాలి. అయితే మిగిలినవి బాగోవా అంటే… బాగుంటాయనే చెప్పాలి. కానీ ఆ పాటల మజా అలాంటిది మరి. ‘పుష్పక విమానం’లో ఓ పెళ్లి పాట ఇటీవల విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో వచ్చిన పెళ్లి పాటల్లో ఆకట్టుకునేవి ఓ పది చూద్దాం!
* కళ్యాణం కమనీయం… (పుష్పక విమానం – ఆనంద్ దేవరకొండ, గీత్)
* కళ్యాణం వైభోగం… (శ్రీనివాస కళ్యాణం – నితిన్, రాశీ ఖన్నా)
* సీతా కళ్యాణ వైభోగమే… (రణరంగం – శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్)
* చక్కందాల చుక్క… (కళ్యాణ వైభోగమే – నాగశౌర్య, మాళవిక నాయర్)
* అయిదు రోజుల పెళ్లి… (వరుడు – అల్లు అర్జున్, భానుశ్రీ మోహ్రా)
* వధువేమో అలమేలు… (శతమానంభవతి – శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్)
* అలనాటి రామచంద్రుడు… (మురారి – మహేశ్‌బాబు, సోనాలీ బింద్రే)
* ధర్మార్థ కామ మోక్షములలో (జానీ – పవన్ కల్యాణ్, రేణు దేశాయ్)
* శతమానంభవతి… (రాధాగోపాశం – శ్రీకాంత్, స్నేహ)
* కళ్యాణం చూతము రాండీ… ‘ఎవరే అతగాడు – వల్లభ, ప్రియమణి)
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?