నేను వాటిని ఛాలెజింగ్ గా తీసుకున్నాను : సోనమ్ కపూర్

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తెగా తెరంగేట్రం చేసిన సోనమ్ కపూర్ కొద్ది కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అనిల్ కూతురిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని ఏర్పరుచుకుంది. గ్లామర్ తోనే కాదు.. నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజాను ప్రేమించి పెళ్ళాడింది. పెళ్ళైన తరువాత కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది సోనమ్.

ఇటీవల అర్భాజ్ ఖాన్ నిర్వహించిన `పించ్‌` కార్యక్రమానికి హాజరైంది సోనమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్ కపూర్… గతంలో తానెదుర్కొన్న బాడీ షేమింగ్ అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. సోనమ్ మాట్లాడుతూ.. “నేను సన్నగా, పొడుగ్గా, నల్లగా ఉంటానని అందరూ నన్ను ఎగతాళి చేసేవారు. నిన్నెవరు పెళ్ళి చేసుకుంటారని అడిగేవారు. అయితే అలాంటి కామెంట్స్ కు నేనేమీ కుంగిపోలేదు. ఆ కామెంట్స్ ను ఛాలెంజింగ్‌గా తీసుకుని ఫిట్‌నెస్‌ పై దృష్టి పెట్టాను. బాలీవుడ్ హీరోయిన్‌గా ఎదిగాను. నేను కోరుకున్న వ్యక్తినే పెళ్ళాడాను. ఇంతకంటే నేను నిరూపించుకోవాల్సింది ఏముంది. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను” అంటూ సోనమ్ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus