Sonia Love Story: బిగ్ బాస్ 8 : ఇది సోనియా ప్రేమ కహానీ..!

బిగ్‌బాస్ 8 లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది సోనియా (Sonia) . తోటి హౌస్మేట్స్ తో గొడవలు వంటి వాటితో పాటు ఓ పక్క నిఖిల్ (Nikhil), మరోపక్క పృథ్వీ (Prithviraj)..లతో ఈమె చేస్తున్న రొమాన్స్ నిత్యం హాట్ టాపిక్ అవుతుంది.’ఈ సీజన్లో ఎక్కువగా విష్ణుప్రియ  (Vishnu Priya)  ప్రేమ వ్యవహారాలు నడుపుతుందేమో’ అని ముందుగా అనుకున్నారు. కానీ సోనియా ఆ లిస్ట్..లో చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోపక్క ఆమె రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి కూడా ఓపెన్ అయ్యింది సోనియా.

Sonia Love Story

ఆమె ప్రేరణతో (Prerana) తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ అతనికి ప్రపోజ్ చేయలేదు కానీ రెండున్నరేళ్లుగా మేము కలిసి పనిచేస్తున్నాం. నేను ఒక ఎన్‌జీఓ వెబ్‌సైట్ డిజైనింగ్ నిమిత్తం అతన్ని కలిశాను. ఆయనే ఆ వెబ్ సైట్ డిజైన్ చేసి ఇచ్చాడు. అలాగే దానికి(ఎన్ జీ ఓ) ఆయన యూఎస్ నుండి స్పాన్సర్ గా కూడా వ్యవహరించాడు’ అంటూ సోనియా చెప్పుకొచ్చింది. అందులో ఇబ్బంది ఏముంది? అంటూ ప్రేరణ అడిగింది. అందుకు సోనియా ‘అతనికి వేరే అమ్మాయితో రిలేషన్ ఉంది.

అయితే అతను నా లైఫ్‌లోకి వచ్చాకా చాలా ఛేంజస్ వచ్చాయి. ఫ్యామిలీ నుండి నేను దూరంగా ఉండేదాన్ని. నా గోల్స్‌కి ఇబ్బంది అవ్వకూడదని. కానీ అతను వచ్చాక ఆ ఆలోచన మారింది’ ప్రేరణకి చెప్పింది సోనియా. మళ్ళీ ప్రేరణ.. ‘మరి ఇంకో వ్యక్తితో రిలేషన్ అన్నావ్ కదా?’ అంటూ ప్రశ్నించింది. అందుకు సోనియా ‘అతను డివోర్స్డ్. నా డెసిషన్ కోసం వెయిటింగ్ అంతే..!’ అంటూ ప్రేరణ చెవి దగ్గరికొచ్చి చిన్నగా చెప్పింది.

ఇందుకు ప్రేరణ.. ‘నువ్వు అర్థం చేసుకున్నది నాకు నచ్చింది’ సోనియాకి కాంప్లిమెంట్ ఇచ్చింది. మరోపక్క నిఖిల్.. సోనియాని హగ్ చేసుకున్నాడు.పృథ్వీ అయితే జోక్ చేసి సోనియాని నార్మల్ చేస్తున్నట్టు వ్యవహరించాడు. ప్రస్తుతం సోనియా ప్రేమ కహానీ వైరల్ అవుతుంది.

ఆ కారణం వల్లే దేవర టైటిల్ ఫిక్స్ చేశాం.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus