Jr NTR: ఆ కారణం వల్లే దేవర టైటిల్ ఫిక్స్ చేశాం.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva)  కాంబోలో తెరకెక్కిన దేవర (Devara) మూవీ రిలీజ్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర సినిమా రిలీజ్ అవుతుండటంతో టెన్షన్ గా ఉందని పేర్కొన్నారు. దేవర రిజల్ట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నానని టీమ్ అంతా ఈ మూవీ కోసం ఎంతో కష్టపడిందని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించడం గమనార్హం. అనిరుధ్  (Anirudh Ravichander) మ్యూజిక్ ను మెచ్చుకున్న తారక్ ప్రస్తుతం అనిరుధ్ శకం నడుస్తోందని తన మ్యూజిక్ తో అనిరుధ్ అదరగొడుతున్నాడని తెలిపారు.

Jr NTR

సక్సెస్ అందుకున్న కొంతకాలానికి చాలామంది వేర్వేరు కారణాల వల్ల ఫెయిల్ అవుతారని అనిరుధ్ మాత్రం అలా కాదని తారక్ తెలిపారు. ఒక సినిమాకు మ్యూజిక్ ఎంత అవసరమో అనిరుధ్ కు తెలుసని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) స్థాయికి అనిరుధ్ వెళ్తాడని తారక్ పేర్కొన్నారు. అనిరుధ్ అద్భుతమైన వ్యక్తి అని జైలర్ (Jailer) , విక్రమ్ (Vikram), మాస్టర్ (Master) సినిమాలకు అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.

దేవర అంటే దేవుడు అనే అర్థం అని అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చాలనే ఆలోచనతో ఈ టైటిల్ ను ఫిక్స్ చేశామని తారక్ అన్నారు. కరణ్ జోహార్ (Karan Johar) సూచనలతో జాన్వీ కపూర్ ను (Janhvi Kapoor) ఈ సినిమాలో తీసుకున్నామని ఆయన కామెంట్లు చేశారు. జాన్వీ కపూర్ తన యాక్టింగ్ తో షాక్ కు గురి చేశారని తారక్ తెలిపారు. ఇప్పటికే దేవర సినిమాకు సంబంధించి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై అంచనాలను పెంచేశాయి.

దేవర సినిమా సైఫ్ అలీ ఖాన్ కు (Saif Ali Khan)  సైతం విలన్ గా భారీ సక్సెస్ ను, మంచి పేరును అందించడం పక్కా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద దేవర మూవీ పాజిటివ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటే మాత్రం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయి.

జానీ మాస్టర్ కేసు.. లేడీ కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus