Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 బట్టలు సరిగ్గా వేసుకోవాలని తెలీదు నీకు.. హౌస్ లో లేడీస్ గొడవ.!

బిగ్‌బాస్ సీజన్ 8లో (Bigg Boss 8 Telugu) 2వ వారం నామినేషన్ల హడావిడి ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో లేడీస్ పెట్టుకున్న గొడవలు ఒకప్పుడు వాటర్ ట్యాంక్..ల వద్ద లేడీస్ ఫైటింగ్ ను తలపించాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ ను గమనిస్తే… సీతను (Kirrak Seetha)  నామినేట్ చేస్తూ “నీకు టాస్క్ అర్థం కాలేదు అని నాకు అర్థమైంది.ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ముందు మీ చీఫ్‌కి చెప్పాలి అది కూడా నీకు తెలీదు” అంటూ సోనియా ఘాటుగా చెప్పింది. ఆ తర్వాత సీత.

Bigg Boss 8 Telugu

“నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు. అది నీ అభిప్రాయం మాత్రమే..! నాకు నొప్పి అయితే నేను చెబుతాను. మీ గేమ్లో (Bigg Boss 8 Telugu) మీకు నొప్పైతే మీ చీఫ్‌ వద్దకి వెళ్తారేమో” అంటూ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత వీళ్ళ మధ్య మాటల యుద్ధం మరికాసేపు జరిగింది. అటు తర్వాత సీత … “ముందు నువ్వు గేమ్ అర్థం చేసుకోవడం నేర్చుకుని తర్వాత నాకు వివరించు. క్లారిటీ నీకు నాకు ఉంది. బొక్కలో క్లారిటీ.” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత కూడా ‘సోనియా నువ్వు బొక్క’ అని నేను అనలేదు.

నీ రాజ్యంలో నీ రాజు తప్పయినా మీరు లొంగుతారేమో.. నేను అలా కాదు మాట్లాడతా.. నా ఇష్టం నేను మాట్లాడతా..’ అంటూ దాన్ని మరింత పొడిగించింది. ఇక విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసింది. ‘గత వారం జరిగిన నిఖిల్ (Nikhil) ఇష్యూ గురించి రెయిజ్ చేస్తూ నేను అన్న దానికి సారీ చెప్పా.. కానీ నా పైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు మీరు.. దానికి నాకు సారీ చెప్పలేదు’ అంటూ విష్ణుప్రియ ప్రశ్నించింది. ఆ తర్వాత సోనియా ‘నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు..

మన మధ్య ఆ ర్యాపో లేదు.. నాకు అది అడల్ట్రీనే..’ అంటూ తెలిపింది సోనియా. తర్వాత విష్ణుప్రియ (Vishnu Priya) .. ‘అసలు నేను ఏం అడల్ట్రీ (18 ప్లస్) జోక్స్ వేశా? మీరు మాత్రమే తెలివైనవాళ్లు కాదు.. పిల్ల బచ్చా జోకులేసుకుంటే దాన్ని అడల్ట్రీ అని ఎలా అంటారు..? ‘ అంటూ సోనియా ప్రశ్నిస్తే.. అందుకు ‘ఇప్పుడు కూడా అంటా’ అంటూ మళ్ళీ సోనియా రెచ్చిపోయింది.

థియేటర్లలో ‘ది గోట్‌’ చూడలేదా? ఓటీటీలో చూస్తానంటే అన్ని గంటలు..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus