కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అనే ప్రశ్నలు మొదలవుతాయి. థియేటర్‌కి వెళ్లి ఎలాగూ చూడలేం.. ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసేద్దాం అనుకుంటారు. అయితే కొన్ని సినిమాల విషయంలో ఓటీటీ డేట్ గురించి అభిమానుల నుండి ఎలాంటి ప్రశ్న ఉండదు. ఎందుకంటే అక్కడే చూడలేకపోతున్నారు జనాలు మళ్లీ ఓటీటీలో ఎందుకు అనుకోవడమే. వినడానికి హార్స్‌గా అనిపిస్తుండొచ్చు కానీ.. ఇప్పుడు అభిమానులు అలాంటి ఫీలింగ్‌లో ఉన్న సినిమా ‘ది గోట్’ (The Greatest of All Time) .
విజయ్ (Thalapathy Vijay) అభిమానులు ఎంతో ఆశతో, ఆతృతతో ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. అయితే ‘వెంకట్ ప్రభు (Venkat Prabhu) హీరో’ థియేటర్లలో దెబ్బేశాడు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది అన్నారు కానీ కథలో విషయం లేదు అని టీమ్ భావించలేదు. దీనికి నిడివి సమస్య కూడా యాడింగ్. సినిమా థియేటర్లలో చూడాలంటే సుమారు 3 గంటల నిడివి. ఇదే ఎక్కువ అనుకుంటుంటే ఓటీటీలో ఈ సినిమా నిడివి గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
సోషల్ మీడియా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఇటీవల రిప్లై ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు మొదట అనుకున్న నిడివి 3.40 గంటలనిచెప్పారు. అంతేకాదు అంతే రన్‌టైమ్‌తో ఓటీటీలోకి వస్తారు అని కూడా టాక్. మరోవైపు సినిమా గురించి వస్తున్న విమర్శల గురించి వెంకట్ ప్రభు మాట్లాడుతూ సినిమాను ప్రేక్షకుల కోసం తీశానని, క్రిటిక్స్ కోసం కాదని అన్నారు. సినిమా (The Greatest of All Time ) కోసం మేం పడ్డ కష్టం గురించి మాట్లాడరు.
అభిమాని ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పాత సినిమాల రిఫరెన్స్‌లు తీసుకున్నాం. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా కథను తీర్చిదిద్దాం అని వెంకట్ ప్రభు చెప్పారు. ఇక విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమా (The Greatest of All Time) ఈ నెల 5న విడుదలైంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 280 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.