సోనూ క్రేజ్ సినిమాలకు పనికొచ్చేలా లేదే..!

2020 అనేది చాలా బ్యాడ్ ఇయర్ అని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఆ బ్యాడ్ ఇయర్ కొంతమంది రియల్ హీరోస్ ను కూడా మనకు పరిచయం చేసింది అనేది వాస్తవం. వాళ్ళలో సోనూ సూద్ ను మొదటిగా చెప్పుకోవాలి. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో ఇతను పేద వాళ్లకు చేసిన సాయం అంతా ఇంతా కాదు..! గమ్య స్థలాలకు చేరుకోలేక ఇబ్బంది పడుతున్నవారిని.. వారి సొంత ఊర్లకు చేర్చడమే కాకుండా ఎంతో మంది రైతులకు కూడా చేయూతనిచ్చాడు. అంతేకాదు ఎంతో మంది నిరుద్యోగులకు.. ఉపాధి కల్పించాడు. అందుకే మన సోనూ సూద్ ను.. రియల్ హీరో అన్నారు.

ఇతని క్రేజ్ ను వాడుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. ఎన్నడూ లేనిది.. ఇతని పుట్టినరోజు నాడు కొంత మంది టాలీవుడ్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. ట్వీట్ల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఓ సినిమా యూనిట్ సభ్యులు అయితే ఇతనికి షూటింగ్ స్పాట్ లోనే సన్మానం చేసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకుని పీక్స్ లో పబ్లిసిటీ చేసుకున్నారు. ఆ సినిమా ఈ సంక్రాంతికే విడుదలయ్యింది. మొదటి షోతోనే ఆ సినిమాకి అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది. పండగ పేరు చెప్పుకుని.. ఆ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఇక పండగ ముగిసాక సోనూ సూద్ క్రేజ్ తో ఒడ్డుకు చేరుకుందాంలే అనుకున్నారనుకుంట.

పోస్టర్ ల పై కూడా సోనూ సూద్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇన్ని చేసినా.. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమని తేలిపోయింది. అయితే ఆ సినిమా వల్ల సోనూ సూద్ క్రేజ్ కు ఎఫెక్ట్ అయ్యేలా ఉందనేది కొందరి అభిప్రాయం. ఆ సినిమాకి సోనూ సూద్ ఫ్యాన్స్ విపరీతంగా వెళ్తారులే అనుకుంటే అలా జరగడం లేదట. దాంతో ‘సోనూ సూద్ ను జనాలు మర్చిపోయారు.. జనాలు చాలా షార్ట్ మైండెడ్’ అని వారు కామెంట్స్ చేస్తున్నారు. అయినా ‘సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ.. సోనూ సూద్ ఉన్నా పవన్ కళ్యాణ్ ఉన్నా లాభం ఉండదు’ అనే విషయం కూడా వారు గ్రహించాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus