ప్రేక్షకులలో నటుడు సోనూ సూద్ ఇమేజ్ గురించి విశ్లేషణ చెయ్యాలంటే కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అని విశ్లేషించాలి. కష్టాలలో ఉన్న సాటి ప్రజలను ఆదుకోవడానికి అతడు ముందడుగు వేశారు. ఆపద అన్నవారికి సాయం చేశారు. సినిమాల్లో విలన్ వేషాలు వేసిన సోనూ సూద్… కరోనా కాలంలో ప్రజలకు చేసిన సాయం త నిజజీవితంలో హీరో అయ్యారు.
ఇప్పుడు ప్రేక్షకులు అతడిని చూసే దృష్టి మారింది. సోనూ సూద్ రియల్ లైఫ్ ఇమేజ్ కి తగ్గట్టుగానే దర్శకులు నిర్మాతలు అతడి దగ్గరికి స్క్రిప్టులు తీసుకువెళ్తున్నారు. “ఇప్పుడు నా దగ్గరకు వస్తున్న స్క్రిప్టులు మారాయి. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లను ఎక్కువ మంది ఆఫర్ చేస్తున్నారు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. నేను రెడీగా ఉన్నాను” అని సోనూ సూద్ లేటెస్టుగా చెప్పుకొచ్చారు.
ప్రజెంట్ సోనూ సూద్ హైదరాబాద్ లో ఉన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కందిరీగ సంతోష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా ‘అల్లుడు అదుర్స్’లో యాక్ట్ చేస్తున్నారు. సోను సూద్ మానవతా దృక్పథాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ పురస్కారాన్ని అందజేసింది.
Most Recommended Video
బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!