కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లుగా.. “గేమ్ ఛేంజర్” (Game Changer) విడుదలకు వెయ్యి అడ్డంకులు వస్తున్నాయి. మొన్నటివరకు షూటింగ్ కంప్లీట్ అవ్వక, ఆ తర్వాత ఎడిటింగ్ ఓ కొలిక్కి రాక, ఆ తర్వాత సీజీ వర్క్ పెండింగ్ ఉండి, అనంతరం ప్రమోషన్స్ టైమ్ కి మొదలెట్టలేక ఇలా నానా ఇబ్బందిలుపడుతూ ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న “గేమ్ ఛేంజర్”కి తెలుగులో అడ్డంకి ఏమీ లేదు కానీ.. తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో మాత్రం సమస్యలు ఎదుర్కొంటుంది.
తమిళంలో “గేమ్ ఛేంజర్” రిలీజ్ కి లైకా సంస్థ అడ్డంకిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. శంకర్ (Shankar) “ఇండియన్ 3” (Indian 2) కంప్లీట్ చేయకుండా “గేమ్ ఛేంజర్” ఎలా రిలీజ్ చేస్తారంటూ తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను అప్రోచ్ అయ్యింది. దాంతో రేపు (జనవరి 7) ప్లాన్ చేసిన తమిళ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా దాదాపుగా క్యాన్సిల్ అయినట్లే. తమిళ రిలీజ్ కి సమస్య లేదంటూ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రకటించినప్పటికీ.. మొదటి షో పడేవరకు క్లారిటీ రాదు.
ఇక ఇప్పుడు నార్త్ లోనూ “గేమ్ ఛేంజర్”కి గట్టిపోటీ ఎదురైంది. సోనూ సూద్ (Sonu Sood) స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం “ఫతే” కూడా జనవరి 10న విడుదలవుతుంది. జాక్వలిన్ (Jacqueline Fernandez) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ మహేష్ బాబు (Mahesh Babu) విడుదల చేసారు. ఈ సినిమా హిందీలో మాత్రమే విడుదలవుతున్నప్పటికీ..
అక్కడ సోనూ సూద్ కి ఉన్న మార్కెట్ & క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుంటే.. రామ్ చరణ్ (Ram Charan) కంటే సోనూ సూద్ కి ఎక్కువ టికెట్లు తెగుతాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అటువంటి సోనూ సూద్ ఎప్పడు టైమ్ దొరకనట్లు తన సినిమాని సరిగ్గా జనవరి 10న విడుదల చేయనుండడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.