Anushka: అనుష్క సినిమాల్లోకి రావడానికి ఆ విలన్ కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి అనుష్క గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి అనుష్క ఇలాంటి క్రేజ్ సొంతం చేసుకోవడానికి కారణం ఎవరు అంటే అందరూ పూరి జగన్నాథ్ పేరే చెబుతారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దీంతో ఫిలిం ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ అందుకోవడానికి పూరి జగన్నాథ్ కారణమని చెబుతారు. కానీ అనుష్క స్టార్ హీరోయిన్ అవడానికి ప్రముఖ విలన్ సోనుసూద్ కారణమని తెలుస్తుంది. సూపర్ సినిమా సమయంలో పూరి జగన్నాథ్ సోను దగ్గర మాట్లాడుతూ సూపర్ సినిమా కోసం ఎవరైనా సెకండ్ హీరోయిన్గా కొత్త అమ్మాయి ఉంటే చూడమని చెప్పారట. అయితే సోను సూద్ ప్రతిరోజు యోగాకి వెళ్లే సమయంలో అనుష్కని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చేవారట

ఈ అమ్మాయి అయితే సినిమాలలోకి సరిగ్గా సరిపోతుందని భావించిన సోనుసూద్ యోగా టీచర్ దగ్గర అనుష్క ఫోన్ నెంబర్ తీసుకుని పూరి జగన్నాథ్ కు ఇచ్చారట దాంతో పూరి జగన్నాథ్ అనుష్కని సంప్రదించి సినిమా అవకాశాన్ని కల్పించారు . ఇలా అనుష్క సూపర్ సినిమాకు సక్సెస్ అయిన తర్వాత అక్కడ సోను సూద్ ను చూసిన అనుష్క మీరేంటి ఇక్కడ అని అడగడంతో మీకు ఈ సినిమాలో ఛాన్స్ రావడానికి తానే కారణం అంటూ పూరి జగన్నాథ్ జరిగినది మొత్తం చెప్పారట

అలా సోనుసూద్ కారణంగా అనుష్క (Anushka) ఇండస్ట్రీలోకి వచ్చిందని చెప్పాలి. ఇక అనుష్క నటించిన అరుంధతి సినిమాలో ఈయనే విలన్ పాత్రలో నటించి అనుష్కకు బ్లాక్ బస్టర్ అందించారు. అనుష్క ఇండస్ట్రీలో స్టార్ట్ అవ్వడానికి సోను సూద్ కారణం అని చెప్పాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus