సోనూ సూద్ ఇప్పుడు అడగగానే కోర్కెలు తీర్చే కలియుగ దైవం. అడిగిన వెంటనే దేవుడు కంటే తొందరగా వారి కోర్కెలు తీర్చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఓ రైతుకు ట్రాక్టర్ పంపిన సోనూ సూద్, ఓ చెల్లికి రాఖీ పండుగకు ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక నిరుద్యోగి చేత వ్యాపారం పెట్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే సోను సూద్ సహాయాల చిట్టా చాలా పెద్దదే. కరోనా కారణంగా రోడ్డున పడ్డ వలస కార్మికులతో మొదలైన ఆయన సాయం అప్రతిహంగా కొనసాగుతుంది. ఐతే ఆయన మంచి మనసును, సేవ గుణాన్ని మిస్ యూజ్ చేస్తున్నారు కొందరున్నారు. అలాగే అడిగిందే తడవుగా ఇచ్చేస్తున్నాడని ఏది పడితే అది అడుగుతున్నారు.
తాజాగా ఓ బాలుడు సోనూ సూద్ కి ట్విట్టర్ లో పెట్టిన మెస్సేజ్ ఆసక్తికరంగా మారింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ప్లేయింగ్ గేమ్ సెట్ అడిగాడు. దీనికి సోనూ సూద్ ఆసక్తికర సమాధానం చెప్పారు. నీలేష్ నింబోర్ అనే ఆ బాలుడు ట్విట్టర్ లో ”సోను సూద్ సార్ మీరు నాకు దయచేసి ఓ పీఎస్4 సెట్ పంపించండి. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర అది ఉంది. ఈ లాక్ డౌన్ లో వారు చక్కగా ఆడుకుంటున్నారు. నాకు కూడా దానితో ఆడుకోవాలని ఉంది” అని మెస్సేజ్ పెట్టారు .
దానికి సూను సూద్ ” పీఎస్4 సెట్ నీ దగ్గర లేదంటే, నువ్వు చాలా అదృష్టవంతుడవు అని అర్థం. దానికి బదులు నువ్వు పుస్తకాలు చదువు. అవైతే నేను నీకు పంపిస్తాను” అన్నారు. ఈ సంగతి గమనిస్తున్న నెటిజన్స్ మాత్రం సూను సూద్ అంటే పిల్లలకు కూడా ఎగతాళి అయిపోయింది అనుకుంటున్నారు. వాళ్లకు ఇష్టం వచ్చినవి అడిగేస్తున్నారని వాపోతున్నారు. కాయలున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు అన్నట్లు, దానాలు చేస్తున్న నాటి నుండి సోనూ సూద్ ఆస్థులపై ప్రభుత్వాలు నిఘా పెంచేశాయి.
Most Recommended Video
ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!