నటుడిగా తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో గుర్తింపును సొంతం చేసుకున్న సోనూసూద్ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో చేసిన సేవా కార్యక్రమాల ద్వారా పాపులారిటీని పెంచుకున్నారు. తాజాగా ఆదాయపు పన్ను శాఖ సోనూసూద్ ఏకంగా 20 కోట్ల రూపాయల పన్ను ఎగవేశారని సంచలన ప్రకటన చేసింది. అయితే నటుడు సోనూసూద్ మొత్తం ఆస్తుల విలువ ఏకంగా 130 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. దాదాపుగా 21 సంవత్సరాలుగా వరుస సినిమా ఆఫర్లతో సోనూసూద్ బిజీగా ఉన్నారు.
తెలుగులో సోనూసూద్ విలన్ పాత్రల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు. ప్రస్తుతం సోనూసూద్ ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. సోనూసూద్ కు సొంతంగా శక్తిసాగర్ ప్రొడక్షన్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. 2016 సంవత్సరంలో సోనూసూద్ ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. సోనూసూద్ దగ్గర ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారుతో పాటు పోర్సే పనెమెరా కారు కూడా ఉంది. సోనూసూద్ నటించిన ఆచార్య మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా సోనూసూద్ కు ఇతర భాషల్లో కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
పలువురు నిర్మాతలు సోనూసూద్ హీరోగా సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి సోనూసూద్ సహాయ కార్యక్రమాలు చేశారు. సోనూసూద్ ఛారిటీ అకౌంట్స్ లో ప్రస్తుతం 18 కోట్ల రూపాయలు ఉన్నాయని సమాచారం. ఆ మొత్తాన్ని పేదల కోసమే ఖర్చు చేస్తానని సోనూసూద్ వెల్లడించారు.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?