Sonu Sood: ఆటోవాలాకు సోనూసూద్ సర్‌ప్రైజ్.. ఏమైందంటే?

  • November 27, 2021 / 10:18 PM IST

రియల్ హీరో సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. సోనూసూద్ అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోనూసూద్ ను అభిమానించే అభిమానులు, సోనూసూద్ ద్వారా సహాయం పొందిన వాళ్లు సోనూసూద్ ను జీవితంలో ఒక్కసారైనా కలవాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి తన ఆటోపై “ఒక్కటే జీవితం.. ఒక్క ఛాన్స్.. సోనూసూద్ సార్.. మిమ్మల్ని కలవడానికి అవకాశం కల్పించండి” అంటూ రాసుకున్నారు.

సోనూసూద్ కు వీరాభిమానిగా మారిన ఆటో డ్రైవర్ ఈ విధంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. సోనూసూద్ ను కలవడానికి ఆటోవాలా ముంబైకు కూడా వెళ్లగా సోనూను కలవడం ఆటోవాలాకు సాధ్యం కాలేదు. అయితే ఈ విషయం సోనూసూద్ దృష్టికి రావడంతో సోనూసూద్ నేరుగా కలిసి ఆ అభిమానిని ఆశ్చర్యపోయేలా చేశారు. ఆటోలో డ్రైవింగ్ సీట్లో కూర్చొని అభిమాని వినోద్ తో సోనూసూద్ ముచ్చటించారు. సోనూసూద్ కలవడంతో చాలా సంతోషంగా ఉందని తన కల నెరవేరిందని అభిమాని చెప్పుకొచ్చారు.

సోనూసూద్ కూడా తనకు ఆటో తోలాలని కోరిక ఉండేదని ఆ కల తీరిందని చెప్పుకొచ్చారు. సోనూసూద్ కోరిక మేరకు వినోద్ సోనూసూద్ కు హైదరాబాద్ అంతా ఆటోలో తిప్పి చూపించారు. వినోద్ సోనూసూద్ దగ్గర డబ్బులు తీసుకోనని చెప్పగా సోనూసూద్ మాత్రం వినోద్ కు డబుల్ అమౌంట్ ఇస్తానని చెప్పారు. సోనుసూద్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus