Sonu Sood: వ్యాక్సిన్ తీసుకున్నా సోనూసూద్ కు కరోనా..?

  • April 17, 2021 / 04:22 PM IST

గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో కష్టాల్లో ఉన్న కార్మికులకు, పేదలకు తన వంతు సహాయం చేసి రియల్ హీరోగా సోనూసూద్ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు కరోనా సోకడంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోనూసూద్ పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ కావడం వల్ల కష్టాల్లో ఉన్నవాళ్లకు సంబంధించిన సమస్యలను తీర్చడానికి తనకు మరింత సమయం దొరుకుతుందని సోనూసూద్ వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ సోనూసూద్ కు కరోనా వచ్చింది. కొన్ని రోజుల క్రితం సోనూసూద్ సంజీవిని అనే కోవిడ్ టీకా డ్రైవ్ ను ప్రారంభించారు. ఆ సమయంలో సోనూసూద్ ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. మరోవైపు సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఆచార్య సినిమాలో సోనూసూద్ పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తైంది. కేవలం ఒకటి రెండు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉందని సమాచారం.

సోనూసూద్ కు కరోనా సోకినా ఆ ప్రభావం ఆచార్య సినిమాపై ఉండదని తెలుస్తోంది. మే 13వ తేదీన ఆచార్య సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయి.


Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus