లాక్ డౌన్ లో కొందరు హీరోలు ఇంటి పనులు చేసారు, కత్రినా అయితే గిన్నెలు కూడా కడుక్కుంది పాపం. ఇక హీరోయిన్లు యోగాలు, ఎక్షర్ సైజ్ లు చేస్తూ. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో లైవ్ లు చేస్తూ టైంపాస్ చేశారు. పాపం దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల ఓనర్లు భవిష్యత్ గురించి మధనపడుతూ కూర్చున్నారు. ఈ గ్యాప్ లో ఆర్జీవీ మూడు సినిమాలు తీసి, రిలీజ్ కూడా చేసేసాడు అది వేరే విషయం అనుకోండి.
అందరికంటే ఎక్కువగా ఈ లాక్ డౌన్ లో వినిపించిన పేరు సోనూ సూద్. ఆటను చేసిన సేవలు ప్రపంచం మొత్తం అతనివైపు తల తిప్పుకొని చూసేలా చేశాయి. ఇప్పటికీ సోనూ తనకు వీలైనంతలో సహాయం చేస్తూనే ఉన్నాడు. అతడి వెనుక ఎవరు ఉన్నారు అనేది అప్రస్తుతం. అతడి సహాయాన్ని, అవసరార్థులకు అండగా నిలుస్తున్న విధానం మాత్రం ప్రశంసనీయం. ఇప్పుడు సోను లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయినవారితోపాటు.. ఉపాధి కోసం వెతుక్కుంటున్నవారికి అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాడు.
ఢీల్లీలో ఫేమస్ అయిన బ్యాటరీ ఆటోలను ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడానికి పూనుకున్నాడు. ఏ పని చేయకుండా ఉండడం, అడుక్కోవడం కంటే రిక్షా నడుపుకోవడం బెటర్ అనే భావన కల్పిస్తున్న సోను సూద్ చరితార్థుడు. సోనూ ఇదే విధంగా అవసరార్థులను ఆదుకుంటూ ముందుకు సాగాలని కోరుకుందాం.