అవును సోనూ సూద్ కు డివోట్స్ ఎక్కువైపోయారు. విలన్ గా అతను స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు. కానీ ఆ అతని మనసు వెన్న అని గతేడాది లాక్ డౌన్ టైములో ప్రూవ్ అయ్యింది. నిస్సహాయ స్థితిలో ఉన్న వారు సాయం అంటే చాలు.. ‘జనతా గ్యారేజ్’ స్టైల్ లో వెళ్లి సాయం చేస్తున్నాడు. ఇప్పటికే అతను ఎంతో మందికి సాయం చేసాడు, ఆకలి తీర్చాడు, యువతకి ఉపాధిని కూడా కల్పించాడు.
అలాంటి వ్యక్తి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా జనాలు కొట్టేలా ఉన్నారిప్పుడు. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే.. తాజాగా సోనూసూద్ ను కొట్టినందుకు గాను ఓ 7 ఏళ్ళ పిల్లడు కోపంతో టీవీ పగలగొట్టాడు. మేటర్ లోకి వెళితే… తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన 7 ఏళ్ళ పిల్లాడు విరాట్ సోనూ విలన్ గా నటించిన ఓ సినిమాని చూస్తున్నాడు. అయితే క్లైమాక్స్ లో సోనూని హీరో కొట్టడంతో విరాట్ తట్టుకోలేక కోపంతో ఓ రాయిని తీసుకొచ్చి టీవీ పై విసిరాడు.
అది యాక్టింగ్ అని ఆ పిల్లాడికి తెలీదు కదా. మా సోనూ అంకుల్ నే కొడతాడా.. అంటూ ఆ పిల్లాడు ఆగ్రహం వ్యక్తం చేసాడట. తెలుగు రాష్ట్రాల్లో కూడా సోనూ సూద్ కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిపోయింది. కాదు కాదు భక్తులు పెరిగారని చెప్పాలి. విరాట్ లానే మిగిలిన పిల్లలు కూడా ఇలా మారితే రేపన్న రోజున థియేటర్లలో వాళ్ళు సోనూ సినిమా చూసినప్పుడు కూడా స్క్రీన్ పై రాళ్లు విసిరే ప్రమాదం ఉంది.