మన సినిమాలపై స్పెషల్ ఫోకస్.. డైరెక్ట్ ఓటీటీ!

ఓటీటీ కంపెనీలకు కరోనా వైరస్ మరింత బలాన్ని ఇస్తోంది. కరోనా రాకముందు చాలా మందికి అసలు ఓటీటీ అనే పదం గురించి కూడా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ బ్రాండ్ వాల్యూ రూరల్ ఏరియాలకు కూడా బలంగా పాకేసింది. ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడం కూడా మరికొంత బూస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ వాటిలో సగానికి సగం ఓటీటీ ఆఫర్స్ కు ఎప్పటికైనా తలొగ్గాల్సిందే.

వచ్చే ఏడాది వరకు థియేటర్స్ బిజినెస్ అంతంతమాత్రంగానే ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఓటీటీ సంస్థలు భారీ డీల్స్ కు నిర్మాతలను ఎట్రాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్ మాత్రమే సౌత్ ఇండియన్ సినిమాలను ఎక్కువగా దక్కించుకుంటోంది. ఇక తెలుగులో ఆహా పోటీ ఇస్తున్నప్పటికి ఒక స్టేజ్ వరకే ఆగిపోతొంది. అయితే అందరికి ఒకేసారి కౌంటర్ ఇచ్చేలా ప్రముఖ సోని సంస్థ ‘సోని లివ్’ తో బడా ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం.

రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 14 ఇంట్రెస్టింగ్ సౌత్ సినిమాలను డైరెక్ట్ గా రిలీజ్ హక్కులను దక్కించుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అందులో 4 తెలుగు సినిమాలు కూడా ఉన్నాయట. రానున్న రోజుల్లో పోటీ ఇవ్వడానికి సోని లివ్ గట్టి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా వెబ్ సిరీస్ లని కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus