మోహన్ బాబు ఇష్యూపై స్పందించిన సౌందర్య భర్త!

సీనియర్ స్టార్ హీరోయిన్, దివంగత సౌందర్యకి (Soundarya) శంషాబాద్ పరిధిలో ఉన్న జల్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. దానిని విక్రయించమని గతంలో మోహన్ బాబు (Mohan Babu) సౌందర్యని కోరడం జరిగింది. కానీ సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ అందుకు ఒప్పుకోలేదు. “అందుకు మోహన్ బాబు సౌందర్యపై కక్ష్య పెంచుకున్నాడు. సౌందర్యని ఆమె సోదరుడిని మోహన్ బాబు హత్య చేసి హెలికాప్టర్ ప్రమాదం అని టాపిక్ డైవర్ట్ చేశారు. సాక్ష్యాలు కూడా దొరక్కుండా చేశాడు.జల్ పల్లిలో ఉన్న తన భూమిని మోహన్ బాబు అక్రమంగా అనుభవిస్తున్నాడు.

Mohan Babu

ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మిలిటరీ సోదరులు, పోలీస్, ఆనాధలు, మీడియా వంటి వారికి ఇవ్వాలి” అంటూ ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామ పంచాయతీకి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. అలాగే తనకు మోహన్ బాబు (Mohan Babu) నుండి ప్రాణహాని ఉందని కూడా కంప్లైంట్లో పేర్కొన్నాడు చిట్టిమల్లు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటున్నారు. మరికొంతమంది మోహన్ బాబుపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో సౌందర్య భర్త రఘు రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ” కొద్దిరోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రోపర్టీ విషయంలో మోహన్ బాబు, సౌందర్య పేర్లని అనవసరంగా ప్రస్తావిస్తున్నారు. నా భార్యకి సంబంధించిన ఆస్తిని మోహన్ బాబు లాక్కున్నారు అనేది అబద్ధం. అవన్నీ నిరాధారమైనవి. 25 ఏళ్లుగా నాకు మోహన్ బాబు కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. మా ఫ్యామిలీస్ మధ్య ఒక హెల్దీ రిలేషన్ షిప్ ఉంది. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించి మా రిలేషన్ ను దెబ్బతీయకండి” అంటూ అతను చెప్పుకొచ్చాడు.

వీక్ డేస్లో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘ఛావా’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus