బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న దక్షిణాది హీరోయిన్స్

బాలీవుడ్ కి చెందిన బ్యూటీలు దక్షిణాది సినీ పరిశ్రమల్లో హవా కొనసాగించడం ఆనవాయితీ. ఇక్కడ నుంచి వెళ్లి బాలీవుడ్ లో పేరు తెచుకున్నవారు మాత్రం చాలా తక్కువే. ఈ లెక్క మారనుంది. దక్షిణాది అమ్మాయిలు బాలీవుడ్ లో చక్రం తిప్పడానికి రంగం సిద్ధమైంది. హిందీలో ఎంట్రీ ఇవ్వబోతున్న భామలపై ఫోకస్..

అనుష్క Anushkaఅందాలు ఆరబోయడమే కాదు.. వీరోచితంగా విన్యాసాలు చేసి విజయాలను అందుకున్న నటి అనుష్క. ఒప్పుకున్నా పాత్ర ఎంతకస్టమైనా ఓర్చుకొని చేసి టాప్ హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఆమె నటించిన బాహుబలి హిందీలోనూ ఘన విజయం సాధించడంతో ఆమెకు బాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

నయనతార Nayanataraతమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నటి నయనతార. ఈమె దక్షిణాది నాలుగు భాషల్లోనూ సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. బిజీ షెడ్యూల్ తో బాలీవుడ్ లోకి వెళ్లని ఈ భామ త్వరలో అక్కడ అడుగుపెట్టబోతోంది.

అను ఇమ్మానుయేల్ Anu Emanuelమజ్ను సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అను ఇమ్మానుయేల్ అతి తక్కువ కాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని పట్టేసింది. అదే జోరులో బాలీవుడ్ లో ల్యాండ్ కానుంది.

రెజీనా కాసాండ్రా తెలుగులో అనేక సినిమాలు చేసిన రెజీనా కాసాండ్రాకు బాలీవుడ్ స్వాగతం పలుకుతోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించడానికి సైన్ చేసింది. హిందీ సినిమా తన కెరీర్ కు మంచి బ్రేక్ ఇస్తుందని రెజీనా నమ్మకంతో ఉంది.

క్యాథరిన్ అయస్కాంతంలాంటి అందం కలిగిన సుందరి క్యాథరిన్ ఏ హీరో పక్కననైనా చక్కగా సూట్ అయిపోతోంది. ఇక రొమాంటిక్ సన్నివేశాలను అద్భుతంగా పండించగలదు. అందుకే బాలీవుడ్ హీరోలు క్యాథరిన్ కావాలని కోరుకుంటున్నారు.

ప్రణీత కన్నడ బ్యూటీ ప్రణీత మాతృభాషలో కంటే తెలుగులో బ్లక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అమాయకత్వం, మెరిసే సొగసు కలిగిన ప్రణీతను బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సంప్రదిస్తున్నారు. ఆమె బాలీవుడ్ ఎంట్రీ గురించి త్వరలో ప్రకటన రానుంది.

నిక్కీ గర్లానిమల్లూవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ అన్ని పరిశ్రమల్లో యువ హీరోలతో సినిమాలు చేసి నిక్కీ గర్లాని యువతకు దగ్గరైంది. తన అందం, అభినయంతో ప్రేక్షుకులను అలరించిన ఈ బ్యూటీ హిందీ ప్రేక్షకులు ఆకట్టుకోవడానికి రెడీగా ఉంది.

నమిత ప్రమోద్ మలయాళ ముద్దుగుమ్మ నమిత ప్రమోద్ దక్షిణాది అన్ని భాషల్లో నటించి అభినందనలు అందుకుంది. ఆమె నటనతో పాటు ఫిట్ నెస్ గమనించిన బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సినిమాలో నటింపచేయించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతా సెట్ అయితే ఈ ఏడాది నమిత ప్రమోద్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus