ఉత్సాహానికి నిలువెత్తురూపం రవితేజ. ఆయన ఎక్కడుంటే అక్కడ పవర్ వస్తుంది. ఎనర్జీ వ్యాపిస్తుంది. చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకుండా అసిస్టెంట్ డైరక్టర్ గా అడుగు పెట్టి చిన్న పాత్రల్లో కనిపిస్తూ, మెప్పిస్తూ మాస్ మహారాజ్ కిరీటాన్ని అందుకున్నారు. నేడు (జనవరి 26 ) ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రవితేజ నటించిన చిత్రాల్లో ఆకట్టుకున్న పాత్రలపై ఫోకస్..
సింధూరంరవితేజ చిత్ర పరిశ్రమలోకి వచ్చి అప్పుడే పదేళ్లు గడిచిపోయాయి. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నారు. తొలి సారి ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా “సింధూరం”. 1997 లో వచ్చిన ఈ మూవీలో రవితేజ్ చేసిన “చంటి” పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
సముద్రంనీకోసం చిత్రంతో కథానాయకుడిగా రవితేజ ఎదిగారు. అయినప్పటికీ సముద్రం మూవీలో నెగిటివ్ రోల్ చేయడానికి వెనుకాడలేదు. చేపల నాని పాత్రలో జీవించారు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంనెగిటివ్ రోల్స్ కి గుడ్ బై చెప్పి నలుగురి హీరోల్లో ఒకరిగా నటిస్తూ వస్తున్న రవితేజకి సోలో హీరోగా నిలబెట్టిన మూవీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సుబ్రహ్మణ్యం గా కూల్ గా నటించి విజయాన్ని సొంతం చేసుకున్నారు
ఇడియట్రవితేజకు అభిమాన సంఘాలు ఏర్పరిచిన మూవీ ఇడియట్. ఇందులో రవితేజ పోషించిన చంటి పాత్రకు యువకులు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. సాధారణమైన యువకుడిలా అతని నటన సూపర్. అందుకే ఈ చిత్రాన్ని విద్యార్థులు సూపర్ హిట్ చేయించారు.
ఖడ్గంక్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అందరితో ప్రశంసలు అందుకుంది. ఇందులో సినిమా ఛాన్స్ కోసం తిరివే యువకుడు కోటి పాత్రలో రవితేజ నటన అమోఘం. ఇందులో నటనకు రవితేజ తొలిసారి నంది అవార్డు అందుకున్నారు.
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిచలాకీ హీరోగా సాగిపోతున్న రవితేజకు కమర్షియల్ హీరో హోదాను తెచ్చి పెట్టిన క్యారక్టర్ చందు. “అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి”లో చందుగా రవితేజ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించారు. ఈ మూవీ కలక్షన్ల వర్షం కురిపించింది.
వెంకీశ్రీను వైట్ల మెగా ఫోన్ నుంచి వచ్చిన వెంకీ మూవీ రవితేజను మాస్ ఆడియన్స్ కి చాలా దగ్గర చేసింది. ఇందులో రవితేజ కామెడీ టైమింగ్ అద్భుతహా అనిపించుకుంది. యాక్షన్ సీన్స్, డ్యాన్సులు మాస్ ప్రేక్షుకులను ఉర్రూతలూగించింది.
విక్రమార్కుడురవితేజ ద్వి పాత్రాభినయం చేసిన చిత్రం విక్రమార్కుడు. దొంగ అత్తిలి సత్తి బాబు, ఏఎస్పీ విక్రమ్ సింగ్ రాథోడ్ గా రెండు వేరియేషన్స్ ని చక్కగా పలికించారు. ఎమోషన్స్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో రవితేజ నటన మాటల్లో వర్ణించలేము. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రవితేజ కెరీర్ లో మరుపురాని చిత్రంగా నిలిచింది.
కిక్సరదా పాత్రలు చేయడం రవితేజకు అత్యంత సులువు. అటువంటి క్యారక్టర్ కి యాక్షన్ జోడిస్తే కిక్ వస్తుంది. కిక్ సినిమాలో కళ్యాణ్ గా పూర్తి జోష్ తో నటించి ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. దర్శకుడు సురేందర్ రెడ్డి.. మాస్ మహారాజ్ లోని పూర్తి ఎనర్జీని ఇందులో చూపించారు.
పవర్ట్రాన్స్ఫార్మర్ కి ఖాకీ చొక్కా తొడిగితే ఎలా ఉంటుంది.. ? ఏసీపీ బల్దేవ్ సహాయ్ లాగా ఉంటుంది. పవర్ సినిమాలో రవితేజ పోషించిన ఈ పాత్ర అందరితో శెభాష్ అనిపించుకుంది. ఈ మూవీ 49 కోట్లు వసూలు చేసి రవితేజ పవర్ చూపించింది.