ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?
- October 18, 2026 / 05:29 PM ISTByFilmy Focus Desk
‘రాజాసాబ్’ చిత్రంతో ఆశించిన స్థాయిలో సంతోషం దక్కకపోవడంతో కాస్త ఢీలా పడిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు.. ఇప్పుడు తమ ఆశలన్నీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమా పైనే పెట్టుకున్నారు.
తొలిసారిగా ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా మేకర్స్ తీసుకున్న నిర్ణయం అభిమానులకు ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. ముందుగా ప్రకటించినట్లుగా ఈ చిత్రం 2027 మార్చి 5న కాకుండా, ఏకంగా ఏడు నెలల పాటు వెనక్కి వెళ్లి 2027 అక్టోబర్ 29న విడుదల కానుందని అధికారికంగా వెల్లడించారు.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు ముందుగా అనుకున్న తేదీకి రావడం కష్టమే అని అందరూ మానసికంగా ఫిక్స్ అయిపోయారు. కానీ, ఇలా ఏకంగా ఏడు నెలల పాటు వాయిదా పడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. దీనికి తోడుగా, అక్టోబర్ 29వ తేదీతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక అనుభవం ఉండటంతో.. ఇప్పుడు వారిలో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
సరిగ్గా 18 ఏళ్ల క్రితం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ఏక్ నిరంజన్’ చిత్రం 2009 అక్టోబర్ 29నే విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే డేట్‌కి ‘స్పిరిట్’ వస్తుండటంతో.. ఆ పాత ఫ్లాప్ సెంటిమెంట్ ఎక్కడ రిపీట్ అవుతుందో అని ఫ్యాన్స్ తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు. మరి సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో కలిసి ఈ నెగెటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టిస్తారేమో చూడాలి!














