టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా ఒక విధానం రన్ అవుతూ వస్తోంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఆ వ్యవస్థే రన్ అయింది. అదే పీఆర్‌వో. హీరోలకు సంబంధించిన ఏ విషయమైనా సరే పీఆర్‌వోలే చెబుతారు. అయితే అందరూ ఇలా యాక్టివ్‌గా చెప్పరు అనుకోండి. ఎన్నో ఏళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. అంటే హీరో – ఫ్యాన్‌కి మధ్య పీఆర్‌వో ఉంటాడన్నమాట. అయితే ఇప్పుడు మధ్యలో మరో వ్యక్తి వస్తారు అని అంటున్నారు.
ఇంకా చెప్పాలంటే సినిమాల్లోకి రాజకీయాల స్టయిల్‌ను తీసుకొస్తారట. అంటే ప్రతి పార్టీకి అధికార ప్రతినిధి ఉన్నట్లు సినిమా హీరోలకు ఓ అధికార ప్రతినిధి ఉంటారట. ఈ ఏర్పాటు రప్పా రప్పా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నుండి మొదలవుతుంది అని చెబుతున్నారు. అయితే ఇక్కడే అందరికీ ఓ డౌట్ వస్తుంది. అల్లు అర్జున్‌కి ఆల్‌రెడీ ఒక స్పోక్స్ పర్సన్ ఉన్నారు కదా అని. ఆయన విషయాల్ని ఎక్కువగా చెప్పేది బన్ని వాస్ (Bunny Vasu). మరి ఆయనుండగా మరో స్పోక్స్ పర్సన్ ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న.
దీని వెనుక పెద్ద కారణమే ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం బన్నీకి హీరోగా మంచి ఇమేజ్, ఎలివేషన్లు వచ్చినా.. సంధ్య థియేటర్ ఘటన తర్వాత చాలా లాస్ కూడా జరిగింది. ఆయన స్పందన, బాడీ లాంగ్వేజ్ ఇబ్బంది పెట్టాయి. దీంతో తిరిగి బ్రాండ్‌ను బిల్డ్ చేసుకునే క్రమంలోనే స్పోక్స్ పర్సన్‌ను పెట్టుకుంటున్నారు అని టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో మార్కెటింగ్‌కి ఆ పర్సన్ ఉపయోగపడతారు అని వారి ఉద్దేశమట.
ఒకవేళ అల్లు అర్జున్ ప్రయత్నం సక్సెస్ అయితే ఇలాంటి విధానం మిగిలిన హీరోలు పాటిస్తారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టైల్‌లో సింగిల్ పాయింట్ కాంటాక్ట్ ఉంటుంది. కాబట్టి ఏవన్నా వాళ్లనే అడగాలి. పీఆర్‌వోలు అంటే ఎక్కువగా సినిమాల వరకే ఉంటారు. ఈ అధికార ప్రతినిధులు వ్యక్తిగత విషయాలకు మాత్రమే ఉంటారు. చూద్దాం ఇదెంతవరకు వెళ్తుందో.