నిఖిల్ హీరోగా నటించిన తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘స్పై’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి హెచ్ దర్శకుడిగా మారుతూ చేసిన ఈ మూవీ జూన్ 29 న విడుదల అయ్యింది. చరణ్ తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె రాజ శేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా… టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం..
అలాగే ‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ నుండి వచ్చిన పాన్ ఇండియా సినిమా కావడంతో ‘స్పై’ కి భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.మొదటి షోతోనే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. మొదటి రోజు నిఖిల్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. రెండు, మూడు రోజుల్లో కూడా బాగానే కలెక్ట్ చేసింది.ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
3.07 cr
సీడెడ్
0.95 cr
ఉత్తరాంధ్ర
0.79 cr
ఈస్ట్
0.47 cr
వెస్ట్
0.30 cr
గుంటూరు
0.60 cr
కృష్ణా
0.36 cr
నెల్లూరు
0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
6.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.80 cr
మిగతా భాషల్లో
0.35 cr
ఓవర్సీస్
1.60 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
9.55 cr (షేర్)
‘స్పై’ (SPY) చిత్రానికి రూ.15.95 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.16.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.9.55 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.65 కోట్ల షేర్ రావాలి. శని, ఆదివారాలు ఎలాగూ మిగిలే ఉన్నాయి కాబట్టి.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.