ప్రిన్స్ మహేష్…టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు…తన తాజ్గ సినిమా స్పైడర్ విషయంలో మంచి దూకుడు మీద ఉన్నాడు అనే చెప్పవచ్చు…బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత వస్తున్న సినిమాపైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రిన్స్ అభిమానులు…ఎలా అయినా ఈ సినిమాని హిట్ గా మలచాలి అన్న ఆలోచనలో ఉన్న ప్రిన్స్ ఫ్యాన్స్ కి ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వినిపిస్తుంది….అదేంటి అంటే…ఈ సినిమా ఇటు తెలుగు అటు తమిళ రెండు బాషల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే…అయితే అదే క్రమంలో దాదాపుగా 130కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమా బిజినెస్ పైనే ఫోకస్ పెట్టారు అందరూ…ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే…సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉండడంతో తమిళంలో ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు కొనేశారు…ఇక ఈ దెబ్బతో ఈ ప్రాజెక్ట్ మరింత సంచలనంగా మారింది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.
అంతేకాదు…మరో పక్క స్పైడర్ బిజినెస్ మహేష్ స్టామినాను తెలియచేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల్లో రికార్డ్ బిజినెస్ చేస్తుండగా ఇప్పుడు తమిళంలో కూడా లైకా ప్రొడక్షన్స్ అత్యధికంగా 23 కోట్ల వరకు స్పైడర్ మూవీ కి కోట్ చేసిందని టాక్. మహేష్ స్పైడర్ తోనే తమిళ నాట ఎంట్రీ ఇస్తున్నాడు అయినా సరే ఈ రేంజ్ బిజినెస్ చేయడం మాములు విషయం కాదు. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అని అంటున్నారు. ఇక మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమా కచ్చితంగా మహేష్ ఖాతాలో మరో పెద్ద హిట్ పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ రేంజ్ లో హైప్ ఉన్న ఈ సినిమాకి ఏ రేంజ్ లో కలెక్షన్స్ రానున్నాయో చూడాలి..
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.