హైదరాబాద్ లో స్పైడర్ నెక్స్ట్ షెడ్యూల్
- April 17, 2017 / 09:38 AM ISTByFilmy Focus
తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్పైడర్ లుక్, మోషన్ పోస్టర్ అందరి అభినందనలు అందుకుంది. భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నై లో చిత్రీకరణ జరుపుకుంటోంది. వియత్నాం లో షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా చెన్నై షెడ్యూల్ మొదలెట్టారు. దీని తర్వాత కూడా మహేష్ విశ్రాంతి తీసుకోవడం లేదు. వెంటనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ఎస్.జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియదర్శి తదితరులు పాల్గొననున్నారు. ఇక్కడి షెడ్యూల్ తో టాకీ పార్టీ పూర్తి అవుతుంది. దీని తర్వాత మిగిలిన రెండు పాటలకు చిత్ర బృందం విదేశాలకు వెళ్లనుంది. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















