Squid Game: నెట్‌ఫ్లిక్స్‌లో స్క్విడ్‌ గేమ్‌ను ఎంతసేపు చూశారంటే!

ఓటీటీలో షోలు, సినిమాలు చూసేవాళ్లకు స్క్విడ్‌ గేమ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అంతగా పాపులర్‌ అయిపోయింది. ఎమోషన్స్‌ ఆడుకుంటూ, థ్రిల్లింగ్‌ అందించింది. థియేటర్‌లో సినిమా ఎంత హిట్లో చెప్పాలంటే వసూళ్లు మాట్లాడతారు. మరి ఈ షో ఎంత హిట్‌ అయ్యిందో చెప్పాలంటే… ఆ షోను చూసిన టైమ్‌ మాట్లడాలి. అలా స్క్విడ్‌ గేమ్‌ ఓటీటీ చరిత్రోలనే అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ షోను ఇప్పటివరకు లక్షా 82 వేల సంవత్సరాలు చూశారట.

అదేంటి సంవత్సరాల లెక్క అనుకుంటున్నారా… 1.65 బిలియన్‌ గంటలు అంటే అంతేకదా మరి. అవును ఈ షోను అన్ని గంటలపాటు యూజర్లు స్ట్రీమ్‌ చేశారట. మొత్తంగా ఓటీటీ చరిత్రలోనే ఒక షోకి వచ్చిన అత్యధిక వ్యూస్‌ టైమ్‌ ఇదేనట. ఈ టైమ్‌ ఇంకా పెరగిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిని భారతీయ ప్రాంతీయ భాషల్లోకి కూడా తీసుకెళ్తున్నారు. తాజాగా షో తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. దానికి మీరు దిగువ చూడొచ్చు.

‘స్క్విడ్ గేమ్’ రికార్డులు వ్యూస్‌ విషయంలోనే కాదు… లాభాల పరంగానూ ఘనంగానే ఉందట. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్న ‘స్క్విడ్ గేమ్’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి డబ్‌ చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గతంలో ‘మనీ హైస్ట్‌’ను ఇలా రీజనల్‌ లాంగ్వేజెస్‌లో డబ్‌ చేసి రిలీజ్‌ చేసి మంచి విజయం అందుకున్నారు నెట్‌ఫ్లిక్స్‌ టీమ్‌. ఇప్పుడు అదే స్ట్రాటజీ ‘స్క్విడ్‌ గేమ్‌’కి కూడా అప్లై చేస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus