ఒకప్పటి స్టార్ హీరో, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు కంటమనేని ఉమా మహేశ్వరి ఈరోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె హఠాన్మరణానికి కారణాలు ఏంటి అన్నది అందరినీ అయోమయానికి గురి చేస్తుంది. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్- బసవతారకం దంపతులకు ఆమె నాలుగో కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి నందమూరి అల్లుళ్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు లు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. అందుతున్న సమాచారం ప్రకారం కంటమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె డిప్రెషన్ కు గురవ్వడంతో ఆమె తన గదిలో ఉన్న ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయినట్లు సమాచారం. ఉమా మహేశ్వరి జీవితంలో చాలా ట్రాజెడీ ఉంది.
ఈమెకి రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భర్త నరేంద్ర రాజన్ ఓ శాడిస్ట్. ఈమెను సిగరేట్లతో కాల్చడం వంటివి చేసి చాలా హింసించేవాడు. ఈ విషయం చివరికి రామారావుగారికి తెలియడంతో విడాకులు ఇప్పించి కంటమనేని వారి ఇంటికి కోడలిగా చేశారట.మొదటి భర్త ఎంత హింసించినా ఆమె తన పుట్టింటి వారికి చెప్పేది కాదట. అయితే రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె జీవితం ఇలా మధ్యలోనే రాలిపోవడం విషాదకరం.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?