Uma Maheshwari: ఎన్టీఆర్ చిన్న కూతురు ఆ విషయంలో నిజంగా గ్రేట్..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత స్టార్ హీరో అయిన నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు కంటమనేని ఉమామహేశ్వరి నిన్న హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే వార్త సినీ రాజకీయ నాయకులను విషాదంలోకి నెట్టిందనే చెప్పాలి. అయితే ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉమామహేశ్వరి ఆమె పార్థీవ దేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు వైద్యులు. ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడం, మానసికంగా డిస్టర్బ్ అవ్వడం వల్లే ఆమె మరణించినట్లు.. ఆమె కూతురు దీక్షిత కూడా చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా.. ఎంతో డబ్బు, పలుకుబడి ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అనే అనుమానం కూడా అందరిలోనూ ఉంది. అందుకే పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. ఇక పోస్టుమార్టం నివేదిక రెండు రోజుల్లో రానుంది. ఆమె పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు ఆల్రెడీ అప్పగించారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి ఉమామహేశ్వరి పార్ధీవ దేహాన్ని తరలించినట్టు తెలుస్తుంది. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికా నుండి రావాల్సి ఉంది. కాబట్టి ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

మరోపక్క ఉమామహేశ్వరి భౌతికకాయానికి ఎంబామింగ్‌ ప్రక్రియ కూడా నిర్వహించారట ఉస్మానియా వైద్యలు. ఉమామహేశ్వరి చాలా మంచి వ్యక్తి అని, కనీసం ఎవ్వరికీ చిన్న మాట కూడా అనేది కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాగే ఉమామహేశ్వరి కోరిక ప్రకారం.. ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేయడం కూడా జరిగింది. బ్రతికున్నన్ని రోజులు ఉమా మహేశ్వరి ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్టు ఆమె సన్నిహిత వర్గం చెప్పుకొస్తోంది.

ఆమె మొదటి పెళ్లి ఫెయిల్ అయ్యిందని, మొదటి భర్త మందు బాటిల్స్ తో ఆమె పై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని, సిగరెట్లతో కూడా వాతలు పెట్టేవాడిని.. కానీ ఈ విషయాలు తన తండ్రికి ఆమె చెప్పలేదు అని..! కుటుంబ పరువు కాపాడుకోవడానికి, భర్తను మార్చుకోవడానికి ఆమె పరితపించిందని కానీ తన భర్త మారకపోవడంతో రెండో పెళ్లి చేసినట్లు ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus