ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈమె సోమవారం తన స్వగృహంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారనే వార్త నందమూరి కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలను నింపింది. ఈమె మరణ వార్త తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు హుటాహుటిన తన నివాసానికి చేరుకున్నారు. ఎంతో మంచి మనస్తత్వం గల ఉమామహేశ్వరి ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కేవలం అనారోగ్య సమస్యల వల్ల అధిక ఒత్తిడికి గురైందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఇక ఈమె ఆత్మహత్య చేసుకుని మరణించడంతో పోలీసులు తన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇకపోతే బుధవారం ఈమె అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోనే మహాప్రస్థానంలో జరిగాయి. ఉమామహేశ్వరి పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా వైద్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు అందించారు. పోస్టుమార్టం నివేదికల ప్రకారం ఈమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని అయితే ఉరి వేసుకున్న సమయంలో ఈమె స్వర పేటిక విరిగిపోయి మృతి చెందినట్లు వైద్యులు పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా ఈమె మృతికి కారణాలు తెలిపారు.
అయితే ఈమె మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ఉమామహేశ్వరి మరణ వార్త తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులందరూ అక్కడి చేరుకొని ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. అయితే తన అత్తయ్య చివరి చూపుకు ఎన్టీఆర్ మాత్రం నోచుకోలేదని చెప్పాలి.
ఉమామహేశ్వరి చనిపోయిన సమయంలో ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి లండన్ లో ఉండటం వల్ల ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చినప్పటికీ ఇండియాకు చేరుకోవడానికి ఆలస్యం కావడంతో అప్పటికే ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి అయితే లండన్ నుంచి వచ్చిన తారక్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన అత్తయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?