Sr NTR: వామ్మో.. ఎన్టీఆర్ ఇంత మొండి వ్యక్తా..?

  • May 18, 2021 / 11:16 AM IST

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసపోతూ ఉంటారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ సైతం ఒక నకిలీ వైద్యుని చేతిలో దారుణంగా మోసపోయారు. బీఏ సుబ్బారావు డైరెక్షన్ లో తెరకెక్కిన పల్లెటూరి పిల్ల అనే సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దున్నపోతుతో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ ను షూటింగ్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ ను దున్నపోతు ఎత్తి కుదేసింది. దర్శకుడు బీఏ సుబ్బారావు డూప్ తో తీద్దామని చెప్పినా సీనియర్ ఎన్టీఆర్ వినకుండా తనే ఫైట్ చేస్తానని వెళ్లగా దున్నపోతు వల్ల ఎన్టీఆర్ కుడి చేతికి గాయం కావడంతో పాటు ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు.

సెట్ లో ఉన్నవాళ్లు డాక్టర్ కోసం కబురు పెట్టగా ఒక వ్యక్తి సెట్ కు వచ్చి తాను పుత్తూరు వైద్యుడినని పరిచయం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కు కట్టు కడతానని వచ్చిన ఆ వైద్యుడు ఎన్టీఆర్ కు కట్టు కట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ కు వైద్యం చేసినందుకు ఆ వైద్యుడు రెట్టింపు డబ్బు తీసుకోవడం గమనార్హం. అయితే వైద్యం చేయించుకున్న తరువాత ఎన్టీఆర్ కు నొప్పి తగ్గకపోవడంతో పాటు చేయి బరువెక్కింది.

ఆ తరువాత మరో వైద్యుడిని పిలిపించగా ఆ వైద్యుడు ఎన్టీఆర్ కు మొదట వైద్యం చేసిన వ్యక్తి డాక్టర్ కాదని నకిలీ వైద్యం చేశాడని చెప్పడంతో షాక్ అవ్వడం షూటింగ్ లో పాల్గొన్న సిబ్బంది వంతయింది. ఆ తర్వాత అసలు వైద్యుడు చికిత్స చేయడంతో నెలరోజుల తర్వాత ఎన్టీఆర్ చెయ్యి సాధారణ స్థితికి చేరుకుంది. అయితే ఈ ఘటన జరిగిన తరువాత కూడా ఎన్టీఆర్ డూప్ ను పెట్టడానికి అంగీకరించలేదు. సొంతంగా దున్నపోతుతో ఫైట్ చేసి సీనియర్ ఎన్టీఆర్ రియల్ హీరో అనిపించుకోవడంతో పాటు కొన్ని విషయాల్లో ఎన్టీఆర్ ఎంత మొండిగా ఉంటారో అభిమానులకు తెలియజేశారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus