NTR: ఎన్టీఆర్ ఆ స్టార్ హీరో గురించి తన పర్సనల్ డైరీలో ఏమి రాశారో తెలుసా..!

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కుటుంబాలు ఉన్నా నందమూరి అనే పేరు వినగానే తెలియని గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఒక క్రేజి స్థానాన్ని సంపాదించుకున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. కాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . మామూలు వ్యక్తిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఓ స్టార్ హీరోగా ఎదిగారు. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాలలోనూ తనదైన స్టైల్ లో మెప్పించే సీఎం అయ్యి ప్రజలకు సేవ చేసి మెప్పించిన ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది .

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రథమ స్థానం ఉంది అని చెప్పక తప్పదు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మరణానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చనిపోయే కొన్ని గంటల ముందు ఆయన ప్రాణ స్నేహితుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి మరి ఓ విషయాన్ని చెప్పారట. అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న రచయిత కృష్ణకుమారి వివరించారు . నందమూరి తారక రామారావు (NTR) గారు అక్కినేని నాగేశ్వరావు గారు మంచి మిత్రులు అన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తుల కారణంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయట . ఆ తర్వాత మళ్లీ వీళ్ళ మధ్య అంతటి మంచి సాన్నిహిత్యం ఏర్పడలేక పోయిందట . అయితే నాగేశ్వరరావు గారికి ఎన్టీఆర్ ఒకరోజు కాల్ చేసి ఇంటికి రమ్మన్నారట . “నీతో భోజనం చేయాలని ఉంది ..నీతో కొంచెం మాట్లాడాలి ..ఇంటికి రా “అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పిలిచారట. “నాగేశ్వరరావు గారు సరే వస్తానంటూ రిప్లై ఇచ్చారట . అయితే అక్కడే నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్లే సమయంలోనే ఎన్టీఆర్ మరణించాతన్న వార్త వినిపించింది.

దీంతో అక్కినేని నాగేశ్వరరావు గారి దిగ్భ్రాంతికి గురయ్యారట . అయితే ఎన్టీఆర్ – నాగేశ్వరరావుకి కాల్ చేసింది.. మనసారా క్షమాపణలు కోరడానికి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ” కొందరు వ్యక్తుల కారణంగా మన మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి ..దానికి మనమిద్దరం బాధపడ్డాం.. నా నుంచి తప్పుంటే క్షమించు అని చెప్పడానికే నాగేశ్వరరావు గారిని ఇంటికి పిలిపించాలి అనుకున్నారట. అయితే అప్పటికే ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన పర్సనల్ డైరీలో రాసి ఉంచారట.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus